నీకు విలువ లేనప్పుడు ఎందుకు, ఇటు రా... వంగవీటికి కొడాలి మరో సలహా...?

VUYYURU SUBHASH
ఏపీ రాజ‌కీయాల్లో అధికార వైసీపీ నేత‌లు వ‌ర్సెస్ విప‌క్ష టీడీపీ నేత‌ల మ‌ధ్య ఎలా మాట‌ల తూటాలు పేలుతున్నాయో మ‌నం గ‌మ‌నిస్తూనే ఉన్నాం. కొద్ది రోజులుగా ఈ విమ‌ర్శ‌లు మ‌రింత ఘాటుగా పేలుతున్నాయి. ఇక అధికార వైసీపీ లో ఉన్న మంత్రి కొడాలి నాని అయితే టీడీపీ వాళ్ల‌పై ఎంత ఘాటుగా విరుచుకు ప‌డ‌తారో ప్ర‌త్యేకంగా చెప్పక్క ర్లేదు. అయితే కొడాలి నాని, గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్ , ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్న విజ‌య‌వాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధా ముగ్గురూ కూడా రెండు ద‌శాబ్దాల‌కు ముందు నుంచే మంచి ఫ్రెండ్స్‌. వీరు చిన్న‌ప్ప‌టి నుంచే ఎంతో స్నేహంగా ఉండేవారు.
ఇక నాని, రాధా ఇద్ద‌రూ కూడా 2004లోనే తొలి సారి అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు . వీరిలో నాని టీడీపీ నుంచి, రాధా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే లు అయ్యారు. ఇక 2009లో అయితే కొడాలి మ‌రో సారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రాధా ప్ర‌జారాజ్యం లోకి వెళ్లి పోటీ చేసి ఓడిపోయారు. వంశీ టీడీపీ నుంచి విజ‌య‌వాడ ఎంపీ గా పోటీ చేసి ఓడిపోయారు. అలా వీరి రాజ‌కీయం మ‌లుపులు తిరుగుతూ వ‌స్తోంది. ప్ర‌స్తుతం కొడాలి నాని ఏపీ మంత్రి గా ఉన్నారు.
వంశీ గ‌త ఎన్నిక‌ల లో టీడీపీ నుంచి గ‌న్న‌వ‌రంలో రెండో సారి ఎమ్మెల్యే గా గెలిచినా త‌ర్వాత వైసీపీకి ద‌గ్గ‌ర‌య్యారు. క‌ట్ చేస్తే ఎన్నిక‌ల కు ముందు వ‌ర‌కు వైసీపీ లో ఉన్న రాధా ఆ త‌ర్వాత టీడీపీలోకి వ‌చ్చారు. ఇక ఇప్పుడు టీడీపీలో రాధాకు ప్ర‌యార్టీ లేద‌న్న చ‌ర్చ కొంత వ‌ర‌కు ఉంది. అందుకే ఇటీవ‌ల రాధా అసంతృప్తితో ఉన్నార‌ని అంటున్నారు.
గుడివాడ లో తిరగడం పట్ల, కొడాలి నానీ ని కలవడం పట్ల రాధాకు అచ్చెన్నాయుడు  ఒక వార్నింగ్ ఇచ్చార‌ట‌. అయితే అప్ప‌టి నుంచి ఈ విష‌యం టీడీపీ వాళ్ల‌కు తెలియ‌డంతో వారు రాధా కు దూరం దూరంగా ఉంటున్న‌ట్టు భోగ‌ట్టా ? అయితే కొడాలి నానికి వైసీపీలోకి రావాల‌ని కోరుతున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: