క‌రోనా వ్యాక్సిన్‌పై అమెరికా తిక్క నిర్ణ‌యం..!

Paloji Vinay
ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారితో బాధ‌ప‌డ్డ ప్ర‌జ‌లు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటారు. అదే విధంగా అన్ని దేశాల ప్ర‌భుత్వాలు త‌ప్ప‌నిస‌రిగా తమ దేశ పౌరులంద‌రూ త‌ప్ప‌కుండా క‌రోనా టీకా తీసుకోవాల‌ని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్ర‌మంలో అన్ని దేశాల కంటే ముందుగా క‌నిపెట్టిన అమెరికా 37 కోట్ల జ‌నాభా ఉన్న ఆ దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కూ కూడా రెండు డోసుల వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో అమెరికాలోని టెక్సాస్ గ‌వ‌ర్న‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.
 
    వ్యాక్సిన్ తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి కాద‌ని, ఎవ‌రికి ఇష్టం ఉన్న వాళ్లు టీకాను తీసుకోవ‌చ్చ‌ని టెక్సాస్ గ‌వ‌ర్న‌ర్ గ్రెగ్ అబాట్ ప్ర‌క‌టించాడు. ఈ సంద‌ర్భంగా కోవిడ్ త‌ప్ప‌నిస‌రి విధానాన్ని నిషేధించారు. అలాగే ప్ర‌భుత్వానికి సంబంధించిన కార్య‌క్ర‌మాల‌కు, మ‌త‌ప‌ర‌మైన స‌మావేశాల‌కు కొవిడ్ 19 నిబంధ‌న‌లో వ్యాక్సిన్ తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి కాద‌ని గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. కొవిడ్ వ్యాక్సిన్ సుర‌క్షితమైన‌ది అలాగే ఎంతో ప్ర‌భావవంత‌మైన‌ది వ్యాక్సిన్ తీసుకోవ‌డం వ‌ల్ల క‌రోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డ‌కుండా సురక్షితంగా ఉండ‌చ్చ‌ని  గ్రెగ్ అబాట్ వెల్ల‌డించారు.


 కానీ, బ‌ల‌వంతంగా కాకుండా స్వ‌చ్చంగా ఎవ‌రికి ఇష్టం ఉన్న వారు వ్యాక్సిన్ తీసుకోవ‌చ్చ‌ని. దీని పై ఎలాంటి ఒత్తిడి తీసుకు రావ‌ద్ద‌ని పేర్కొన్నారు. వ్యాక్సిన్ త‌ప్ప‌నిస‌రి కాద‌ని నిషేదిస్తూ టెక్సాస్ అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తున్న‌ట్టు వెల్ల‌డించారు.  గ‌తంలో ప్రైవేట్ కంపెనీల‌కు సంబంధించిన వ్యాక్సిన్ ను కూడా గ‌వ‌ర్న‌ర్ గ్రెగ్ అబాట్ నిషేధించారు. తాజా నిర్ణ‌యంతో అంటువ్యాధుల నిర్మూల చ‌ర్య‌ల‌ను స్వీక‌రించ‌డాన్ని అడ్డుకోవ‌డ‌మే అని వ్య‌తిరేక‌త్త వ్య‌క్తం అవుతుంది.


అగ‌స్టులో కోవిడ్ 19 కు గురైన టెక్సా్ గ‌వ‌ర్న‌ర్‌. గ‌తంలో ప్ర‌భుత్వ వ్యాక్సిన్ ఆదేశాలు, టీకా పాస్‌పోర్ట్ అవ‌స‌రాలు, పాఠ‌శాల‌ల‌కు మాస్కులు అవ‌స‌రం లేకుండా నిషేధం విధించారు. క‌రోనా వ‌ల్ల ఎంతో మంది ప్ర‌జ‌లు ఉద్యోగాలు కొల్పోతున్నారు. ఇప్పుడు మాస్కులు తీసేసి ఫ్రిగా ఉండాలని వంత శాతం ఓపేన్ చేయాల్సిన స‌మ‌యం అని మార్కిలో ఆ గ‌వ‌ర్న‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: