ఒకేరోజులో.. రికార్డు స్థాయిలో న్యాయమూర్తుల నియామకం..!

Chandrasekhar Reddy
దేశంలో మొదటి సరిగా రికార్డు స్థాయిలో న్యాయమూర్తుల నియామకం జరిగింది. ఒక్కరోజులోనే మూడు హైకోర్టులకు 17 మంది జడ్జీలను నియమించారు. ఈ నియామకాల కోసం ఎప్పటి నుండో కేంద్రప్రభుత్వం సిఫారసు కోరింది. గత నెలలో ఆ విషయం పూర్తి కావడంతో ఈ నియామకాలు చోటుచేసుకున్నాయి. ఈ నియామకాలు మొత్తం కూడా మూడు రాష్ట్రాల కోసమే జరగటం విశేషం. ఆయా రాష్ట్రాలలో ఇప్పటికే ఉన్న కేసుల ఒత్తిడికి ఈ నియమాకాలతో కాస్త ఊరట లభించే అవకాశం ఉంది. ఈ నియామకాల తో కేంద్రం ఆయా రాష్ట్రాలలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా సిఫారసుల మేరకే చేసినట్టు తెలిపింది. కరోనా తరువాత ఇంత భారీ స్థాయిలో నియమాలలు జరగటం ఇదే అని కొందరు న్యాయవాదులు అంటున్నారు. ఇప్పటికే ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయడానికి కేంద్రానికి ఇంత సమయం పట్టిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

సిఫారసులు ఆయా న్యాయ మూర్తులు చేసినా లేక కేంద్రం సిఫారసులను వాళ్ళవిగా చూపిస్తూ ఈ నియామకం జరిగిందా అంటూ వాళ్ళు దీనిపై స్పందించారు. కోర్టులలో పెండింగ్ కేసులు తప్ప మరేమి ఉండటం లేదని, న్యాయం కోసం వెళితే అది జరిగేలోపు సాక్షులు, పిటిషన్ దారు, ముద్దాయి కూడా చనిపోయాక కూడా అది అందటం లేదని వారు అంటున్నారు. నియామకాలు భారీగా జరగటం కంటే న్యాయం త్వరగా జరగటమే ముఖ్యమని వారు వ్యాఖ్యానించారు.
అలహాబాద్ హైకోర్టు కు 8 మంది, గువాహటి హైకోర్టు కు 5 మంది, మద్రాస్ హైకోర్టు కు 4 మందిని నియమించారు. ఈ 17 మందిలో 15 మంది న్యాయవాదులు, ఇద్దరు జ్యూడిషియల్ అధికారులు ఉన్నారు. సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం ఆయా హైకోర్టుల జడ్జీలుగా నియామకానికి పలువురి పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అప్పటి నుండి జడ్జీల నియామకం జరగటం ఇది మూడో సారి. గత నెలలో ఈ సిఫారసులు చోటుచేసుకున్నాయి. సీనియర్ న్యాయవాదులు ఇటీవల ఇంతమంది న్యాయమూర్తుల ను నియమించడం చూడలేదని అన్నారు. ఈ సందర్భంలోనే గువాహటి లోని ముగ్గురు అదనపు జడ్జీలకు పూర్తిస్థాయి జడ్జీలుగా పదోన్నతి లభించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: