పాకిస్తాన్ పాస్పోర్ట్.. పరమ వరస్ట్.. ఇదే ప్రూఫ్?

praveen
సాధారణంగా ఏ దేశం అయినా సరే అంతర్జాతీయంగా తమ విలువను అంతకంతకు పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.  ఇక ప్రపంచ దేశాలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవాలని భావిస్తూ ఉంటుంది.  దీనికోసం ఇక ఆ దేశ పాలకులు నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. కానీ అటు పాకిస్థాన్ మాత్రం తమ తీరుతో దేశపు విలువను అంతకంతకూ తగ్గించు కుంటూ వస్తుంది. ఎన్నో ఏళ్ల నుంచి ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ గా కొనసాగుతున్న పాకిస్తాన్.. ఎన్నోసార్లు అంతర్జాతీయ సమాజంలో ప్రపంచ దేశాల ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడ్డాయి.

 ఇక ప్రస్తుతం ఐక్యరాజ్యసమితిలో కూడా గ్రే లిస్టులో కొనసాగుతోంది పాకిస్తాన్.  అయితే ఇంత దారుణమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ అటు పాకిస్థాన్ మాత్రం ఉగ్రవాదాన్ని అస్సలు వదులుకోదు. దేశం మొత్తం సంక్షోభంలో కూరుకు పోతున్నప్పటికీ దేశ పరువు ప్రతిష్ఠలు పోతున్నప్పటికీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ మత రాజ్య స్థాపన లక్ష్యంగా ఎన్నో కుట్రలు పన్నుతూ ఉంటుంది పాకిస్తాన్.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదులా అందరికీ కూడా అండదండలు అందిస్తూ ఉంటుంది. అలాంటి పాకిస్తాన్ విలువ ఎంత దారుణంగా తగ్గిపోయింది అనే విషయం ఇటీవల మరోసారి రుజువైంది.

 ఏ దేశపు పాస్పోర్టు ఎంత విలువ కలిగి ఉంది అన్న విషయాన్ని పాస్పోర్ట్ ఇండెక్స్ అప్పుడప్పుడు నివేదిక ఇస్తూ ఉంటాయి. ఇక ఇటీవల దీనికి సంబంధించిన నివేదికను వెల్లడించింది పాస్పోర్ట్ ఇండెక్స్. నివేదికలో అత్యంత పవర్ ఫుల్ పాస్పోర్టులు ఇచ్చే దేశాలలో...  జపాన్,సింగపూర్, సౌత్ కొరియా, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, ఆస్ట్రేలియా, డెన్మార్క్, ఫ్యాన్స్, ఐలాండ్ దేశాలకు చెందిన పాస్పోర్టులు ఎంతో పవర్ఫుల్ అన్న విషయాన్ని తెలిపారు. అదే సమయంలో పరమ వరస్ట్ పాస్పోర్టులు ఏ దేశాలకు చెందినవి అన్న విషయాన్ని కూడా వెల్లడించారు. ఇందులో పాకిస్తాన్ కి చోటు దక్కడం గమనార్హం. ఆఫ్ఘనిస్తాన్,ఇరాన్, సిరియా, పాకిస్తాన్, యెమెన్ దేశాలకు  చెందిన పాస్పోర్ట్ లు లీస్ట్ పవర్ఫుల్ పాస్పోర్టులు అనే విషయం తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: