సోలార్ సిటీగా మారనున్న బెంగళూరు..!

Podili Ravindranath
ప్రస్తుతం ప్రపంచమంతా కూడా పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేస్తోంది. పెట్రో ఇంధన వనరుల వినియోగం తగ్గించి... పర్యావరణాన్ని కాపాడాలనేది ప్రస్తుతం ఐక్య రాజ్య సమితి తీర్మానం కూడా. ఇందుకోసం ఇప్పటికే ప్రత్యామ్నాయ ఇంధన వినియోగంపై ప్రపంచం దృష్టి సారించింది. రోజు రోజుకూ పెరుగుతున్న పెట్రోల్ ధరలకు భయపడి ఇప్పటికే పెట్రోల్, డీజిల్ వాహనాల వాడకం క్రమంగా తగ్గిస్తున్న ప్రజలు... విద్యుత్ వాహనాల వైపు మొగ్గుతున్నారు. వాహన తయారీ సంస్థలు కూడా క్రమంగా బ్యాటరీ వాహనాల తయారీపైనే పెద్ద ఎత్తున దృష్టి సారించాయి. ఇప్పటికే జల విద్యుత్, ధర్మల్ విద్యుత్ వినియోగం తగ్గించాలని పర్యావరణ వేత్తలు పెద్ద ఎత్తున విజ్ఞప్తి చేస్తున్నారు. అందుకోసమే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు, అనంతపురం జిల్లాల్లో రెండు మెగా సోలార్ పార్క్ లను ఏపీ సర్కార్ ఏర్పాటు చేసింది.
ఇప్పుడు కర్ణాటక సర్కార్ కూడా సహజ వనరులను వినియోగించుకుంటోంది. తుమకూరు జిల్లాలోని పావగడ తాలుకాలో మెగా సోలార్ పార్కును కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కంటికి కనిపించినంత దూరంలో ఈ సోలార్ ప్లేట్లు ఏర్పాటు చేశారు అధికారులు. మొత్తం 12 వేల 800 ఎకరాల్లో ఏర్పాటైన ఈ మెగా సోలార్ విద్యుత్ ప్లాంట్... ఆసియాలో అతిపెద్దదిగా ఇప్పటికే రికార్డుల్లోకి ఎక్కింది. 2018లో ప్రారంభమైన ఈ ప్లాంట్ నుంచి ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైనట్లు కర్ణాటక సోలార్ పవర్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ అధికారులు వెల్లడించారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్... కర్ణాటక రాష్ట్రంలో 15 శాతం అవసరాలు తీరుస్తుందని వెల్లడించారు. పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. దాదాపు 2 వందల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ మెగా సోలార్ విద్యుత్ పార్క్‌ను రాబోయే రోజుల్లో మరింత విస్తరించాలని సర్కార్ భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: