పవన్ కు లైఫ్ టైం... టైం ఇస్తున్నా, దమ్ముంటే జగన్: కొడాలి కామెంట్స్
ఇండస్ట్రీ లైట్ మెన్ దగ్గరనుంచి అందరూ బాగుండాలని మా నిర్ణయం వుంటుంది అని తెలిపారు. నలుగురు చెప్పిన విధంగా జగన్ నడవరు అందరూ కోసం జగన్ నిర్ణయం తీసుకుంటారు అని స్పష్టం చేసారు. ఇది ఎప్పటి నుంచో వున్న సమస్య గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే అని ఆయన స్పష్టం చేసారు. తెలుగు సినిమాని ఎంతో కొంత షూటింగ్ జరపాలి అని కోరుకుంటున్నాము అన్నారు ఆయన. కొంత మంది కి లాభాలు తెచ్చి పెట్టాలని విధాన పరమైన నిర్ణయాలు తీసుకోకుండా అడ్డగోలుగా టిక్కెట్ రెట్లు పెంచారు అని ఆరోపించారు.
చిన్న సినిమా లు ఆడాలి పెద్ద సినిమాలు ఆడాలి అని స్పష్టం చేసారు. పవన్ కళ్యాణ్ గారు అహు అంటే అదిరి బెదిరి పోయే వాళ్ళము కాదు అని అన్నారు. చిత్ర పరిశ్రమపై పవన్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన కొడాలి నాని... జగన్ మోహన్ రెడ్డికి ఎవరి మద్దతు అవసరం లేదు అని స్పష్టం చేసారు. జగన్ మోహన్ రెడ్డిని భయపెట్టే మగాడు ఈ భూమి మీద ఇంకా పుట్టలేదు అని అన్నారు ఆయన. పవన్ కళ్యాణ్ కు జీవిత కాలం టైమ్ ఇస్తున్నా, జగన్ ను టచ్ చేసి చూడు అని సవాల్ చేసారు. పవన్ కళ్యాణ్ జగన్ చిటికన వేలు కూడా తాకలేడు అన్నారు ఆయన.