లేఖల యుద్దం

లేఖల యుద్దం
కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలో ఉ న్న వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాల మధ్య లేఖల యుద్దం జరుగుతోంది. గతంలో పరిపాలనా పరమైన విషయాలపై ప్రభుత్వాధికారులు కేంద్రం , రాష్ట్రాల మధ్య లేఖలు రాసుకునే వారు. ఇది తప్పని సరికూడా. ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవాల్సిన అంశాలు  చాలా ఉంటాయి. ప్రస్తుతం ప్రభుత్వాధినేతలు స్వయంగా  లేఖలు రాస్తున్నారు. ఇది నాయా ట్రెండా ?  
ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి , ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కి లేఖ రాశారు. ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న గ్రామాల సమస్యలు  పరిష్కరించాలంటూ ఆయన తన లేఖలో విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి స్వయంగా చొరవ చూపాలని కూడా ఆయన అభ్యర్థించారు.
తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ కు లేఖ రాశారు. వంశధార నది కి సంబంధించి ట్రైబ్యూనల్ తీర్పు వచ్చి నాలుగు సంవత్సరాలైందని, ఇంతవరకూ అతీగతీ లేదని దీనిపై తగు చర్యలుతీసుకోవాలని కోరారు.  వెనుకబడిన ఉత్తరాంధ్ర రైతుల నీటి అవసరాలు తీర్చేందుకు  నేరడి బ్యారేజి నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. తుది తీర్పును గజిట్ లో ప్రచురించిన తరువాతనే తాము పనులు ఆరంభించేందుకు అవకాశం ఉంటుందని  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి తెలిపారు. వంశధార నది నీటి వాడకం పై \ట్రైబ్యూనల్ 2017 లోనే తీర్పు ఇచ్చిందని, ఇంత వరకూ గజిట్ లో పొందు పర్చకపోవడం పై వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గజిట్ లో ప్రచురించే విషయమై గతంలో ప్రభుత్వాధికారులు కేంద్రాన్ని కోరారని చెప్పారు. 2019 లో కూడా ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందని తెలిపారు. ట్రైబ్యూనల్ తీర్పు  ప్రకారం నేరడి వద్ద బ్యారేజి నిర్మించటం తోపాటు, అనుబంధ ప్రాజెక్టులు కూడా నిర్మించాల్సి ఉందని ఆంధ్ర ప్రధే శ్ ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అంతే కాక ఒడిశా ప్రభుత్వం  వంద ఎకరాలకు పైగా భూములను తమ ప్రాంతంలో  సేకరించి ఆంధ్ర ప్రదేశ్ కు ఇవ్వాల్సి ఉంటుందని ఈ లేఖలో గుర్తు చేశారు. వంశధార పై తగు చర్యలు తీసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  కేంద్ర జలశక్తి మంత్రి కి గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: