మ‌ళ్లి పెరిగిన పెట్రో, డీజిల్‌ ధ‌ర‌లు! ప్ర‌స్తుతం ఎంతంటే?

Dabbeda Mohan Babu
కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వం వ‌చ్చిన నాటి నుంచి సామ‌న్యుల చాలా ఇబ్బందులు ఎద‌ర‌వుతున్నాయి. ప్ర‌స్తుతం దాదాపు అన్ని వ‌స్తువుల ధ‌ర‌లు మండి పోతున్నాయి. అస‌లే నిరుద్యోగం తో బాధ ప‌డుతున్న సామ‌న్య‌లకు అధిక ధ‌ర‌లు న‌డ్డి విరుస్తున్నాయి. సామ‌న్య ప్ర‌జ‌లు వాడే పప్పు, ఉప్పు, మంచి నూనే, చింత పండు వంటి నిత్య అవ‌స‌రాల ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇలా నిత్య అవ‌స‌రాల ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగి పోతుంటే దారిద్ర రేఖ‌కు దిగువున్న ప్ర‌జ‌లు ఎం కొనెట‌ట్టు గానీ ఎం తెనేట‌ట్టు కానీ లేరు. అధిక ధ‌ర‌ల వల్లే ఆర్థిక మాంధ్యం కూడా వ‌స్తుంద‌ని ఆర్థిక విశ్లేష‌కులు సైతం అంటున్నారు. అధిక ధ‌ర‌ల వ‌ల్ల సామ‌న్య ప్ర‌జ‌లు వ‌స్తులు కొన‌డం జ‌ర‌గ‌దు కాబ‌ట్టి స‌ప్లే ఆగిపోతుంది. దీంతో ప‌రిశ్ర‌మ‌ల్లో త‌యారు అవుతున్న వ‌స్తువులు అలాగే ఉంటాయి. అందు వ‌ల్ల ఆర్థిక మాంద్యం పెరుగుతుంద‌ని ఆర్థిక విశ్లేష‌కుల వాద‌న. అయినా పెరుగుతున్న అధిక ధ‌ర‌ల‌ను కేంద్రం నియంత్రంచ‌డం లేదు.


తాజా గా మ‌న దేశంలో మళ్లి పెట్రోల్, డిజిల్ ధ‌ర‌లు పెరిగాయి. ఇప్ప‌టికే లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 60 నుంచి రూ. 100 ల‌నే గ‌తం లోనే క్రాస్ చేసింది. అక్క‌డ కూడా నియంత్ర‌ణ లో ఉండ‌కా పెరిగిపోతూనే ఉంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 105.27 గా ఉంది. అలాగే ఇప్పుడు తాజాగా లీట‌ర్ డీజిల్ పై 26 పైస‌ల్ పెరిగి రూ. 97.17 కు పెరిగింది. ఇలా పెట్రో డీజిల్ ధ‌ర‌లు పెరుగుతూ పోతుంటే టూ వీల‌ర్ వాహానాధారులు విసిగి పోయారు. పెట్రో వాహానాల కంటే ఛార్జింగ్ వాహాన‌ల వైపు దృష్టి మ‌ర‌ల్చారు. ఇప్ప‌టికే చాలా కంపెనీలు ఛార్జింగ్ ద్వి చ‌క్ర వాహానాల‌ను విడుద‌ల చేశాయి. అలాగే టెస్లా అనే కంపెనీ వారు ఛార్జింగ్ కార్ల ను విడుద‌ల చేశారు. ఇప్పుడు తాజా భార‌త దేశంలోనూ ఛార్జింగ్ కార్ల‌ను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాకాలు చేస్తున్నారు.


తాజాగా పెరిగిన ధ‌ర‌ల‌తో హైద‌రాబాద్ లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 105.27 డీజిల్ ధ‌ర రూ. 97.17 గా ఉంది అలాగే వైజాగ్ లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 106.23 డీజిల్ ధ‌ర రూ. 97.65 కి చేరుకుంది. గుంటుర్ లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 107.5 డీజిల్ ధ‌ర రూ.98.88 గా ఉంది. గ‌తంలో నే పెట్రోల్ ధ‌ర లీట‌ర్ కు రూ. 110 వ‌ర‌కు చేరుకుంది. కానీ ఇటివ‌ల కాస్త త‌గ్గినా మ‌ళ్లీ పెర‌గ‌డంతో వాహానా దారుల‌లో భ‌యం నెల‌కోటుంది. ఇలా పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెరిగిపోతుంటే విధ్యుత్ వాహానాల వాడ‌కం పెరిగే అవ‌కాశం ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: