ఏపీకి సుప్రీం నోటీసులు, నవంబర్ లోనే తేలుస్తామన్న సుప్రీం కోర్ట్

Sahithya
రెండు తెలుగు రాష్ట్రాల నీళ్ళ పంచాయితి ఇప్పట్లో పరిష్కారం అయ్యే సూచనలు కనపడటం లేదు. ఈ వివాదంపై సుప్రీం కోర్ట్ ఏ విధంగా స్పందిస్తుంది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎలా రియాక్ట్ అవుతుంది, కృష్ణా యాజమాన్య బోర్డు అలాగే గోదావరి నదీ యాజమాన్య బోర్డ్ లు ఎలా స్పందిస్తాయి అనే వార్తలు వింటున్నాం. కృష్ణా నదీ జలాలకు సంబంధించి యాజమాన్య బోర్డు కి వరుస లేఖలు రాస్తుంది తెలంగాణా ప్రభుత్వం. నిన్న ఏపీ కూడా ఒక లేఖ రాసింది. శ్రీశైలం జలాల్లో వాటా విషయంలో కీలక అంశాలను ప్రస్తావించింది.
విద్యుత్ ఉత్పత్తి నీళ్ళను కూడా వాటా గా కేటాయించాలి అని పేర్కొంది. ఇక నీళ్ళ సమస్య విషయంలో సుప్రీం కోర్ట్ మధ్యవర్తిత్వ మార్గం తో ముందుకు వెళ్ళాలి అని చెప్పినా సరే ఏపీ ప్రభుత్వం కోర్ట్ లోనే తేల్చుకుంటాం అని చెప్పేసింది. తాజాగా  వంశధార ట్రైబ్యునల్‌ తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఒడిశా దాఖలు చేసిన పిటషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.... నాలుగు వారాల్లో సమాధానం దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ను ఆదేశించింది సుప్రీం కోర్ట్ లోని జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ ధర్మాసనం.
కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఒక నోట్‌ రూపంలో అందించాలని ఇరు రాష్ట్రాలను ఆదేశించిన ధర్మాసనం... అదే విధంగా ఇంకా ఏదైనా అదనపు సమాచారం, డాక్యుమెంట్లు కూడా దాఖలు చేయాలని ఆధెశాఉ ఇచ్చింది. తదుపరి విచారణ నవంబర్‌ 11 వాయిదా వేసింది. ఒడిశా లేవనెత్తిన అభ్యంతరాలపై ఈ ఏడాది జూన్‌ 21న ట్రైబ్యునల్‌ ఇచ్చిన తదుపరి ఆదేశాలపై కూడా ఎస్‌ఎల్‌పి దాఖలు చేసింది ఓడిశా. తాజాగా దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా గతంలో దాఖలు చేసిన వాటితో కలిపి విచారణ చేపట్టనున్నట్లు స్పష్టం చేసిన ధర్మాసనం... నవంబర్‌లో పూర్తి వాదనలు ఉంటాయని.. వాయిదాలు లేకుండా విచారణ పూర్తి చేసేందుకు సహకరించాలని జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ ధర్మాసనం కోరింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: