పెట్రోల్ ధరలు పెరగడం వల్లనే ఇడ్లీ దోశలు పెరిగాయా ?

VAMSI
అసెంబ్లీ సమావేశాలు ఎంత హాట్ హాట్ గా కొనసాగుతాయి అనేది మనము ఇది వరకు చూశాము. పాలక పక్షం మరియు ప్రతి పక్షం మధ్యన ఎన్నో వాదనలు జరుగుతాయి. కొన్ని సార్లు ఈ వాదనలు వివాదాలుగా మారుతుంటాయి. ఇప్పుడు కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో ఇలాంటి వాతావరణమే చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే సోమవారం నుండి కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. ఇక్కడ ప్రతిపక్ష హోదాలో ఉన్న కాంగ్రెస్ గత ఐదేళ్లుగా పెరిగిన పెట్రోల్ మరియు డీజిల్ ధరలపై అసెంబ్లీలో తమ నిరసన తెలిపారు. ఇందుకు గాను కాంగ్రెస్ సభ్యులు ఎవ్వరూ కూడా కార్ లలో కాకుండా సైకిల్ లో అసెంబ్లీకి రావడం ఆశ్చర్యకరం. దీనిపై హాట్ హాట్ గా చర్చ జరిగింది. కాంగ్రెస్ నేత మరియు మాజీ సీఎం సిద్ధ రామయ్య మాట్లాడుతూ ప్రస్తుతం కర్ణాటకలో ఇంధన ధరలు పెరగడం కారణంగా సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు అని తెలిపారు.
అంతే కాకుండా ఈ ఇంధన ధరలు పెరగడం కారణంగానే బెంగళూర్ లోని ఐకానిక్ హోటల్ లో ఇడ్లీ మరియు దోశ ధరలు పెరిగాయని వాదించడం సభలో అందరినీ అవాక్కయ్యేలా  చేసింది.  కానీ సిద్దరామయ్య పెట్రో మరియు డీజిల్ ధరలపై చేసిన వ్యాఖ్యలను కర్ణాటక సీఎం మరియు లీడర్ ఆఫ్ ది హౌస్ బసవరాజు బొమ్మై  ఖండిచారు. ఈయన చేసిన వాదనలు పూర్తిగా అవాస్తవం అని పేర్కొన్నారు.  ఇందుకు సీఎం కూడా ఒక హోటల్ ను ఉదాహరణగా చెప్పారు. బెంగళూర్ రేస్ కోర్టు రోడ్ లో ఉండే జనార్ధన్ హోటల్ లో ఇడ్లీ మరియు దోశ లు చాలా రుచిగా ఉంటాయని, నేను ఇక్కడి నుండి టిఫిన్ తెప్పించుకుని తింటానని చెప్పుకొచ్చారు.  ఇక్కడ ఇడ్లీ మరియు దోశల ధరలను వివరించారు. 2017 నుండి ఇప్పటి వరకు ఈ హోటల్ లో ఇడ్లీ ధర 35 రూపాయల నుండి 38 రూపాయలకు పెరిగిందని చెప్పారు. అలాగే 2019 లో మసాలా దోశ ధర 80 నుండి 90 కి పెరిగిందని సెలవిచ్చారు.
సిద్ధ రామయ్య చెప్పినట్లు ఈ హోటల్ లో ధరలు ఎందుకు పెరగలేదని ఎదురు ప్రశ్నించారు. అందుకే ఇంధన ధరలను ఇడ్లీ దోశ ధరలతో పోల్చడం సరికాదని చెప్పారు. ఇడ్లీ దోశ ల ధరల వల్ల ఎవరికీ నష్టం లేదని, ఇంకా చాలా వస్తువులు ధరల పెరుగుదల ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. వాటి పైన దృష్టి పెడితే మంచిదని సిద్దరామయ్యకు సలహా ఇచ్చారు. గత ఐదేళ్లలో పెరిగిన ఇంధన ధరల్లో బీజేపీ ప్రభుత్వం 10 శాతం మాత్రమే పెంచిందని బొమ్మై  చెప్పారు. ఇప్పటి వరకు మోదీ ప్రభుత్వంలో పెరిగిన ఇంధన ధరలు అన్నీ కూడా  అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు పెరగడం వల్లనే పెరిగాయని  కలరింగ్ ఇచ్చారు. మరి ఈ సమావేశాల్లో ప్రారంభం అయిన పెట్రో డీజిల్ రగడ ఇంకెంత దూరం వెళుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: