సిబిఐ కోర్ట్ కు విజయసాయి, వైసీపీ ఎమ్మెల్యే...?

Gullapally Rajesh
ఏపీ సిఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుకి సంబంధించి నేడు సిబిఐ కోర్ట్ లో విచారణ జరిగింది. ఈడీ వాన్ పిక్, గృహ నిర్మాణ కేసుల విచారణ ప్రక్రియ ప్రారంభం అయింది. నేటి హాజరుకు సీఎం జగన్ కు మినహాయింపు ఇచ్చిన కోర్టు... ఇతర నిందితులు హాజరు కావాలని స్పష్టం చేసింది. సీబీఐ కోర్టుకు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి హాజరు అయ్యారు. వాన్ పిక్, లేపాక్షి ఈడీ కేసుల్లో వైకాపా ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు హాజరు అయ్యారు. లేపాక్షి కేసులో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు జె.గీతారెడ్డి హాజరు అయ్యారు.
పారిశ్రామికవేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్, శ్యాంప్రసాద్ రెడ్డి, నిమ్మగడ్డ ప్రకాష్ హాజరు కాగా ఐఏఎస్ మురళీధర్ రెడ్డి, విశ్రాంత అధికారులు బీపీ ఆచార్య, శామ్యూల్ హాజరు అయ్యారు. విశ్రాంత అధికారులు మన్మోహన్ సింగ్, బ్రహ్మానందరెడ్డి నేడు కోర్ట్ విచారణకు హాజరు అయ్యారు. ఈడీ లేపాక్షి, గృహ నిర్మాణ కేసుల విచారణ అక్టోబరు 28కి వాయిదా వేసింది కోర్ట్. ఈ కేసుతో పాటుగా సీబీఐ కోర్టులో ఎమ్మార్ ఈడీ కేసు విచారణ కూడా జరిగింది. కోనేరు ప్రదీప్ పై విచారణ కొనసాగుతోందని కోర్టుకు ఈడీ తెలిపింది.
మిగతా నిందితులపై విచారణ పూర్తయిందని ఈడీ తరుపు న్యాయవాదులు కోర్ట్ దృష్టికి తీసుకువెళ్ళారు. ఎమ్మార్ ఈడీ కేసు విచారణ ఈనెల 29కి వాయిదా వేసింది కోర్ట్. అ కేసుతో పాటుగా గృహనిర్మాణ ప్రాజెక్టుల సీబీఐ ఛార్జ్ షీట్ పై విచారణ జరిగింది. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చింది హైకోర్టు. అభియోగాల నమోదుపై వైవీ సుబ్బారెడ్డి వాదనల కోసం విచారణ అక్టోబరు 1కి వాయిదా వేసింది కోర్ట్. జగన్, విజయసాయిరెడ్డి డిశ్చార్జ్ పిటిషన్లపై కౌంటరుకు గడువు కోరింది సిబిఐ. ఈ కేసుల విచారణకు సంబంధించి జగన్ కోర్ట్ కి హాజరు కావడం లేదని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: