బాబుతో కేశినేని నానికి ఇంత గ్యాప్ వ‌చ్చేసిందా...!

VUYYURU SUBHASH
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నానికి మ‌ధ్య ఇటీవ‌ల గ్యాప్ మ‌రింత పెరిగిన‌ట్టే క‌నిపిస్తోంది. నాని గ‌త ఎన్నిక‌ల‌లో వ‌రుస‌గా రెండో సారి ఎంపీగా గెలిచిన‌ప్ప‌టి నుంచే వీరి మ‌ధ్య ప‌తాక స్థాయిలో యుద్ధం న‌డుస్తోంది. తాను రెండో సారి ప్ర‌భుత్వ వ్య‌తిరేక గాలి ఎదుర్కొని మ‌రీ సొంత ఇమేజ్ తో గెలిచాన‌ని నాని ప‌దే ప‌దే చెప్పుకుంటున్నారు. ఒకానొక స‌మ‌యంలో ప‌రోక్షంగా లోకేష్ ను సైతం టార్గెట్ చేశారు. చివ‌ర‌కు విజ‌య‌వాడ‌లో ఎన్నిక‌ల‌లో ఓడిన బొండా వెంక‌న్న‌, దేవినేని ఉమా లాంటి వాళ్ల‌ను సైతం ఆయ‌న టార్గెట్ చేశారు. బుద్ధా వెంక‌న్న పై తీవ్ర స్థాయిలో విరుచు కుప‌డ్డారు. చివ‌ర‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా వీరి మ‌ధ్య పెద్ద యుద్ధ‌మే జ‌రిగింది.
చంద్ర‌బాబు కూడా నానిని ప‌ట్టించు కోవ‌డం మానేశారు. అయితే చివ‌ర‌కు విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌లో నాని ప‌ట్టు బ‌ట్ట‌డంతో ఆయ‌న ను శాతింప జేసేందుకు ఆయ‌న కుమార్తె శ్వేత‌ను మేయ‌ర్ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారు. దీనిపై స్థానిక టీడీపీ నేత‌ల ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ తీవ్ర స్థాయిలో విరుచు కు ప‌డ్డారు. చంద్ర‌బాబు టూర్‌లో నాని ఉంటే తాము ఆయ‌న కారు ఎక్కం అని కూడా చెప్పారు. చివ‌ర‌కు నాని ఆ ప‌ర్య‌ట‌న‌లో క‌న‌ప‌డ‌లేదు. వీరి గొడ‌వ‌ల కార‌ణంగానే పార్టీ గెల‌వాల్సిన కార్పొరేష‌న్‌ను చేజేతులా కోల్పోయింది.
ఇక ఇప్పుడు బాబు నానిని ప‌ట్టించు కోవ‌డం పూర్తిగా మానేశార‌ని తెలుస్తోంది. బాబు ఇంటి మీద వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ దాడికి పాల్పడినా కేశినేని నాని నోరు మెదపలేద‌ని.. ఖండించ లేద‌ని పార్టీ నేత‌లు చ‌ర్చించు కుంటున్నారు. పైగా త‌న‌పై విమ‌ర్శ‌లు చేసిన పార్టీ నేతలు బోండా ఉమ, నాగుల్ మీరా, బుద్దా వెంకన్నల పై పార్టీ అధినాయకత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయ‌న ఆగ్ర‌హంతో ఉన్నారు. ఇక చంద్ర‌బాబు కూడా పై నేత‌ల‌కే ప్ర‌యార్టీ ఇస్తూ నానిని పెద్ద‌గా ప‌ట్టించు కోవ‌డం లేదు. ఈ పరిణామాలు చూస్తుంటే నానిని బాబు లైట్ తీస్కొంటున్న‌ట్టే క‌న‌ప‌డుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: