నిరుద్యోగులకు లడ్డూ లాంటి వార్త... సింగరేణిలో ఉద్యోగాలు

VAMSI
ప్రభుత్వాధీనంలో కార్యకలాపాలు జరుపుతున్నటువంటి సింగరేణి సంస్థ ఖాళీగా ఉన్న ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు అందుకు ప్రణాళికలు జరుగుతున్నట్లు శుభవార్తను తెలియచేసింది. సంస్థలో 177 వరకు పోస్ట్లు ఉండగా త్వరలోనే వాటికి సంభందించి నోటిఫికేషన్ విడుదల చేస్తామని తీపి కబురును అందించింది. నిన్న విలేఖర్లతో మాట్లాడిన సింగరేణి సంస్థ డైరెక్టర్‌(పా) ఎన్‌.బలరాం ఈ విషయాన్ని మీడియా ముఖంగా వెల్లడించారు. ఈ సమావేశం కొత్తగూడెంలోని ప్రధాన కార్యాలయం వద్ద నిర్వహించడం జరిగింది. ఈ ఉద్యోగాలు సొంత లాభం కోసమో, స్వార్థం కోసమో అక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్న విమర్శలు ఈయన కొట్టివేస్తూ సింగరేణి సంస్థకు సంబంధించిన 177 క్లరికల్‌ ఉద్యోగాల కోసం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయడమే కాదు ఎటువంటి దుష్ప్రచారాలకు తావు లేకుండా రాత పరీక్షను పక్క ప్రణాళికతో నిర్వహిస్తామని, పారదర్శకత ప్రదర్శిస్తామని ఆయన నొక్కి మరి చెబుతూ క్లారిటీ ఇచ్చారు.
ఇకపోతే ఈ నెల 25న  బోర్డు సమావేశం జరగనుందని..ఆ మీటింగ్ లో గతేడాది సింగరేణి సంస్థ గడించిన లాభాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. సంస్థ నుండి  బొగ్గు కొనుగోలు చేసిన కొనుగోలుదారులకు మరో స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎవరైతే ఇంకో వారం లోగా బకాయిలను చెల్లించకుండా ఉంటారో అటువంటి వారికి  ఏడున్నర శాతం వడ్డీ విధించడం జరుగుతుందని ఈ సందర్బంగా ఆయన తెలిపారు. తద్వారా సంస్థకు ఏటా రూ.100 కోట్ల వరకు అదనంగా వస్తుందని అన్నారు  బలరాం. అలాగే సంస్థ పొందిన లాభాల్లో కార్మికులకు అందాల్సిన వాటా తదితర వివరాలు గురించి ముఖ్యమంత్రి, సంస్థ సీఎండీ దసరా లోపు నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.
పరిసర గోదావరీ లోయలలో  బొగ్గు గనుల త్రవ్వకాలను మరియు  పంపిణి మొదలైనవి ఈ సంస్థ యొక్క పని.
తెలంగాణా మెరుగైన అభివృద్ధి, ఆత్మగౌరవ, రాష్ట్రసాధన వంటి  ఉద్యమాల్లో సింగరేణి సంస్థ కీలక  పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ శుభవార్త నిరుద్యోగులకు సంతోషాన్ని కలిగిస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: