స్టాలిన్ పనితీరు భేష్

స్టాలిన్ పనితీరు భేష్
తమిళనాడు ముఖ్య మంత్రి ఎం.కె. స్టాలిన్ పనితీరు భేషుగ్గా ఉందని ఆ రాష్ట్ర నూతన గవర్నర్  ఆర్ ఎన్ రవి కితాబిచ్చారు. కోవిడ్-19 ను అదుపు చేయడంలో స్టాలిన్ చాలా కృషి చేశాడని అన్నారు.  కరోనా కష్ట కాలంలో ఆయన పని తీరు పలువురి ప్రశంసలు అందుకుందని, పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాడని గవర్నర్ ప్రశంసించారు.   ఇటీవలి వరకూ గవర్నర్ గా సేవలందించిన భవ్వర్ లాల్ పురోహిత్ స్థానంలో  ఆర్.ఎన్. రవిని   నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.  ఇటీవల రాష్ట్రపతి భవనం పలు రాష్ట్రాల గవర్నర్ లను మార్తుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్థానభ్రంశాలలో తమిళనాడు గవర్నర్ గా ఉన్న భన్వర్ లాల్ పురోహిత్ ను పంజాబ్ కు నాగాల్ండ్ గవర్నర్ గా ఉన్న రవిని తమిళనాడుకు బదిలీ చేసింది.
నలుగురు మాజీ గవర్నర్ల సమక్షంలో...
తమిళనాడుకు గవర్నర్ గా నియమితులైన రవి నలుగురు మాజీ గవర్నర్ ల సమక్షంలో తన పదవీ ప్రమాణంచేయడం విశేషం. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి  సందీప్ బెనర్జీ రవి చేత  తమిళనాడు 26వ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ  రా ష్ట్రాల మాజీ  గవర్నర్  ఇ.ఎస్.ఎల్ నరసింహన్, ఒడిశా మాజీ గవర్నర్ ఎం.ఎం. రాజేంద్రన్, కేరళ మాజీ గవర్నర్  పి. సదాశివన్, పశ్చీిమ బెంగాల్ మాజీ గవర్నర్ ఎం.కె నారాయణన్ లు హాజరయ్యారు. తమిళనాడు ముఖ్యమం్రతి తాను అనుసరిస్తున్న సంప్రదాయాన్ని కొనసాగించారు. గవర్నర్ కు ఒక పుస్తకాన్ని బహూకరించారు. పది నిమిషాలలో ముగిసిన ఈ కార్యక్రమానికి  ప్రధా నప్రతిపక్ష నేత పళని  స్వామి, పలువురు మంత్రులు, ఆర్.ఎస్.ఎస్ సిద్ధాంత కర్త ఎస్.జి.. గురుమూర్తి  హాజరయ్యారు.
కాగా తమిళనాడులోని పలు ప్రతిపక్ష పార్టీలు  గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న డి.ఎం.కె కు మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమానికి గైర్హాజరైంది. తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె.ఎస్ అళగిరి మాట్లాడుతూ తాము హాజరు కాకపోవడానికి ప్రత్యేక కారణం అంటూ ఏదీ లేదన్నారు.  కేంద్రంలో అధికారంలో ఉన్న బి.జె.పి తమిళనాడుకు ఒక విద్యా వేత్తను కాని, శాస్త్రవేత్తను కాని గవర్నర్గ గా వేసి ఉండాల్సిందన్నారు.  సెంట్రల్ ఇంటలెజెన్స్ అధికారి గా పని చేసిన వ్యక్తిని  నియమించడం పట్ల ఆంతర్యం  ఏమిటో  వెల్లడించాలని అళగిరి డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: