మారుతున్న సమీకరణాలు


మారుతున్న సమీకరణాలు
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు.  నేటి రాజకీయాలలో ఈ మాట అక్షర సత్యం. మీడియా ముందు ఒకరినొకరు తిట్టుకోవడాలు,  మరలా కౌగిలించుకోవడాలు నేటిే రాజకీయాల్లో షరా మామూలే.  నేతలు  తమ ఉపన్యాసాల్లో దంచే సిద్ధాంతాలు అన్నీ నీటి మీద రాతలే.
మహారాష్ట్ర రాజకీయాలు శరవేగంగా కాకపోయనా, తెరచాటుగా మారతున్నయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.  ఇందుకు తాగా  ఉదంతమే సాక్ష్యం.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దేవ్ థాక్రే ఔరంగాబాద్ లో శుక్రవారం పలువురు ప్రముఖులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సమావేశానికి కేంద్ర మంత్రి రావ్ సాహెబ్ దేవేన్ కూడా హాజరయ్యారు. ఇద్దరూ ఒకే వేదికను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఉద్దేవ్ థాక్రే మాట్లాడుతూ తనకు రావ్ సాహెబ్ దేవేన్ గతంలో సహాధ్యాయి అని, భవిష్యత్ సహచరుడని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సహజంగానే రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయి.
రావ్ సాహెబ్ దేవేన్  కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు. మహారాష్ట్రలోని మార్వాడ  ప్రాంతానికి చెందిన నేత . ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ఇద్దరూ మంచి మిత్రులు. పార్టీలకు అతీతంగా వీరి స్నేహం ఉంటుందని  మార్వాడ ప్రజలు పేర్కోంటుంటారు.
 థాక్రే వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించడంతో ఆయన తాను వాడిన పదజాలపై వివరణ ఇచ్చారు. ఒకే వేదికను పలువురు నేతలు పంచుకున్నామని తెలిపారు.  "ఎవరైనా కలసి పనిచేసేందుకు ముందుకు వస్తే వారు భవిష్యత్తులో మిత్రలే కదా అవుతారు ?" అంటూ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.
 ఈ వారం ఆరంభంలో ఇలాంటిదేే మరో సంఘటన జరిగింది. భారతీయ జనతా పార్టీ అధ్యక్షడు చంద్రకాంత్ పాటిల్ తాను పాల్గోన్న ఓ కార్యక్రమంలోనూ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. "|తాము ఎంతో కాలం మాజీ మంత్రులుగా ఉండబోమని, రాజకీయాలు మారుతాయని" వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు పెద్దగా దుమారం కాలేదు. తాజాగా థాక్రే చేసిన వ్యాఖ్యలు మాత్రం పాటిల్ వ్యాఖ్యలతో  మహారా ష్ట్రలో రాజకీయాలు మారనున్నాయన్న చర్చలకు దారితీశాయి. థాక్రే వ్యాఖ్యలపై  ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ప డ్న్ వీస్ స్పందించారు. శివసేన, ఎన్.సి.పిల పొత్తు ఇరు పార్టీలకు ఇబ్బంది కరంగా ఉన్నదన్న విషయం అందరికీ తెలిసిన విషయమన్నారు.
అయితే శివసేన నేత సంజయ్ రావత్ మాత్రం ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తేలిగ్గా తీసుకోవాలని కోరారు. విపరీతార్దాలు తీయవద్దని తనను కలసిన విలేఖరులకు సూచించారు.
 మహారాష్ట్రలో 2019  ఎన్నికల తరువాత రాజకీయ సమీకరణాలు మారాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్జీ రాలేదు. దీంతో ఎన్నికల ముందు వరకూ ఉన్న పొత్తులు విడిపోయి, కొత్త సమీకరణాలు తెరముందుకు వచ్చాయి. వాటి ఫలితంగానే ఆ రాష్ట్రంలో శివసేన  పార్టీ, ఎన్.సి.పి, కాంగ్రెలతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాజకీయాల్లో  ఎప్పటికీ శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు. భవిష్యత్తులో మరాఠా రాజకీయాలు ఎలా మారుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: