తమ్ముళ్ళతో తలనొప్పి...టీడీపీకి రెడీగా భారీగా షాకులు..

M N Amaleswara rao
సాధారణంగా అధికార పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరు ఎక్కువగా ఉండి...పార్టీలో లుకలుకలు వస్తాయి. కానీ ఏపీలో వింతగా ప్రతిపక్ష టి‌డి‌పిలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుకుంటుంది. మామూలుగా అధికార వైసీపీలో ఆధిపత్య పోరు ఉంది. కానీ టి‌డి‌పిలో కూడా ఈ పోరు ఉంది. ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అనే తేడా లేకుండా నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.
అధికారంలో ఉన్నప్పుడు ఎలాగో టి‌డి‌పిలో రచ్చ నడిచింది. దాని వల్ల పార్టీకి చాలా డ్యామేజ్ జరిగింది. అధికారం కోల్పోయి ప్రతిపక్షానికి పరిమితమైన సరే టి‌డి‌పిలో మార్పు వచ్చినట్లు కనిపించడం లేదు. ఇటీవల కాలంలో టి‌డి‌పిలో మరింతగా రచ్చ జరుగుతుంది. ఇప్పటికే విజయవాడలో టి‌డి‌పి నేతలకు పడటం లేదు. అక్కడ గ్రూపులు విడిగాపోయి ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించుకుంటున్నారు. ఇక రాజమండ్రిలో బుచ్చయ్య చౌదరీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.
అటు కాకినాడలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మీ, మాజీ మంత్రి, ఎమ్మెల్యే చినరాజప్పల వర్గాలకు ఏ మాత్రం పడటం లేదు. ఇక విశాఖపట్నంలో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ పట్ల జిల్లాలోని టి‌డి‌పి నేతలు కొందరు గుర్రుగా ఉన్నారు. ఇక సత్తెనపల్లిలో కోడెల శివరాంపై సొంత పార్టీ కార్యకర్తలే ఫైర్ అవుతున్నారు. అనంతపురం జిల్లాలో అయితే చెప్పాల్సిన పని లేదు. టి‌డి‌పి నేతలు మామూలు రచ్చ చేయడం లేదు. అక్కడ జే‌సి ఫ్యామిలీకి చెందిన వర్గానికి, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు వర్గానికి ఏ మాత్రం పడటం లేదు.

 
ఇలా ప్రతి జిల్లాలోనూ టి‌డి‌పి నేతలు రచ్చ రచ్చ చేస్తున్నారు. దీని వల్ల పార్టీకే పెద్ద డ్యామేజ్ జరిగేలా కనిపిస్తోంది. ఈ గొడవల వల్ల కొందరు నాయకులు పార్టీని వీడి వెళ్లిపోవడానికి సిద్ధమైపోతున్నారు. అంటే త్వరలోనే టి‌డి‌పికి భారీ షాకులు తగిలేలా ఉన్నాయి. మరి ఈ పరిస్తితుల నుంచి పార్టీని చంద్రబాబు ఎలా గట్టెక్కిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: