రాజు గాడు ! : ప‌ట్టుకున్నారు దాచిపెట్టారు చంపారు?

RATNA KISHORE
చైత్ర ఘ‌ట‌న‌కు సంబంధించి నిందితుడి త‌ల్లి
ఒక విధంగా మాట్లాడుతోంది
రాజు త‌ల్లి ఏం మాట్లాడినా అది ఆమె భావోద్వేగం
కానీ కేసు ఇలా లేదు మాన‌వ మృగం చేసిన ప‌ని
క్ష‌మించేందుకు వీల్లేకుండా ఉంది
త‌న కొడుకుని ప‌ట్టుకుని దాచి చంపారు అని పోలీసుల‌పై
ఆమె ఆరోప‌ణ‌లు చేస్తోంది

క‌న్న పేగు బంధంతో ఎన్న‌యినా మాట్లాడ‌వ‌చ్చు కాద‌న‌కండి. క‌న్న పేగు బంధం తెగిపోయాక దుఃఖంలో ఎన్న‌యినా చెప్ప‌వ‌చ్చు కాద‌న‌కండి. అక్క‌డ ఆ చిన్నారిని మీరు చూశారా. ఆ పాప భ‌రించిన శారీర‌క‌, మాన‌సిక హింస‌ను మీరు అంచ‌నా వేయ‌గ‌ల‌రా? ఇవీ చిన్నారి చైత్ర‌కు సంబంధించి నెట్టింట్లో రేగుతున్న ప్ర‌శ్న‌లు రాజు అమ్మ మాట‌ల‌పై..

పోలీసుల‌కు రాజును ఎప్పుడో ప‌ట్టుకున్నారు అని, అందుకే త‌మ‌ను విచార‌ణ‌కు పిలిచి త‌రువాత వ‌దిలేశార‌ని, అటుపై త‌న కొడుకు ను చంపార‌ని ఆరోపిస్తుంది రాజు త‌ల్లి. చిన్నారి చైత్ర‌ను పాశ‌వికంగా చంపిన రాజును దేవుడే శిక్షించాడ‌ని ఓ వైపు పౌర స‌మాజం అం టుంటే, మ‌రోవైపు త‌ల్లి మాత్రం వేరే విధంగా స్పందిస్తున్నారు. త‌న‌కు ఎన్నో అనుమానాలు ఉన్నాయ‌ని, పోలీసులే చంపేశారు అని, త‌రువాత దీన్నొక ఆత్మ‌హ‌త్య‌గా చూపిస్తున్నార‌ని వాపోయారు. ఆదివారం నాడే త‌న కొడుకు పోలీసుల‌కు చిక్కాడ‌ని దొరికిన వెం ట‌నే ఎన్కౌంట‌ర్ చేయాల‌న్న పై నుంచి ఆదేశాలున్నాయ‌ని ఆమె ఆరోపించారు.
ఇదిలాఉంటే బాధితురాలి కుటుంబం మాత్రం రాజు మృత‌దేహాన్ని సింగ‌రేణి కాల‌నీకి తీసుకురావాల‌ని కోరుతోంది. దీంతో బాధితు రాలి త‌ర‌ఫున బంధువులు చేప‌ట్టిన ఆందోళ‌న‌తో దిగివ‌చ్చిన పోలీసులు,  చైత్ర మేన‌మామ‌తో పాటు ఐదుగురు సింగ‌రేణి కాల‌నీ వాసులను వ‌రంగ‌ల్ ఏజీఎంకు తీసుకుని వెళ్లారు. చ‌నిపోయింది రాజునా కాదా అన్న విష‌య‌మై స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని కోరుతున్నా రు. దీంతో శ‌వాన్నీ ఇక్క‌డికి తీసుకు రావాల‌ని ముందు ప‌ట్టుబ‌ట్టారు. ఎట్ట‌కేల‌కు పోలీసులు బాధితుల ఆందోళ‌న‌ను అర్థం చేసుకు ని వారినే వ‌రంగ‌ల్ ఏజీఎంకు వెంట‌బెట్టుకుని వెళ్లారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

tg

సంబంధిత వార్తలు: