ఎట్టెట్టా...!

ఎట్టెట్టా...!
ఆంధ్ర ప్రదేశ్ మంత్రి వర్గాన్ని రెండున్నర సంవత్సరాల తరువాత మారుస్తానని సి.ఎం. జగన్ మోహన్ రెడ్డి తన పదవీ ప్రమాణస్వీకారోత్సవ వేళ ప్రకటించిన విషయం  అందరికీ తెలిసిందే.  ఏ.పి.  ముఖ్యమంత్రి అంతటి సాహసాన్ని చేస్తారా ? అని నాటి నుంచి నేటి వరకూ రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు. సి.ఎం. పెట్టిన గడువు త్వరలోనే పూర్తవనుంది.  తన పదవీ కాలం పూర్తవుతుండటంతో పలువులు మంత్రులు హడావిడిగా  వివిధ శాఖల్లో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. మీడియా ముందుకు వచ్చి మట్లాడుతున్నారు. అంతే కాదు తమ కార్యకలాపాలకు ప్రచారం లభించే లా చూడాలని  సిబ్బందిని ఆదేశిస్తున్నారు.
పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి  మంగళగిరిలోని ఏ.పి.ఐ.ఐ. సి కార్యాలయంలో సుధీర్గంగా సమీక్ష సమావేశం నిర్వహించారు.  రాష్ట్ర మంత్రి వర్గ సమావేశానికి కొన్ని గంటల ముందు ఈ కార్యక్రమం జరిగింది "ఒక జిల్లా - ఒక వస్తువు" అన్న నినాదంతో  ముందుకు వెళ్లాలని చేనేత ,జౌళి శాఖ అధికారులకు సూచనలు చేశారు.
 రాష్ట్రంలో తయారయ్యే నేత చీరలకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాలలోను మంచి డిమాండ్ ఉందని తెలిపారు. వెంకటగిరి, పాటూరు తదితర చేనేత చీరలను అమెరికాలోని భారతీయులు ఎక్కువగా ధరిస్తున్నారని,  ఫంక్షన్లలో  ఆంధ్రప్రదేశ్ లో తయారైన చీరలను బహుమతులుగా ఇస్తున్నారని మంత్రి తెలిపారు. అదే విధంగా లేపాక్షి బొమ్మలు, వివిధ ప్రాంతలలో తయారయ్యే హస్త కళాకృతులు పలువురి మన్ననలు పొందాయని పేర్కొన్నారు. వీటన్నింటినీ ఈ- కామర్స్ ద్వారా విక్రయించాలని సూచించారు. ఈ-కామర్సలో ఆర్డర్  వస్తే మూడు నాలుగు రోజుల్లోగా  సదరు వస్తువు వినియోగదారునికి అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. బంజారాలు వేసే ఎంబ్రాయిడరీకి మంచి డిమాండ్ ఉన్నదన్న విషయాన్ని గౌతం రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అదే విధంగా కళాకాలకు మంచి శిక్షణ ఇప్పించాలన్నారు. ఫలితంగా అందులో నాణ్యత పెరుగుతుందని చెప్పారు.  ఆదివాసీ పెయింటింగ్
కొండప ల్లి , ఏటికొప్పాక బొమ్మల కళాకారులకు శిక్షణ ఇప్పించే విధంగా  చర్యలు తీసుకోవాలని అదికారులకు  మంత్రి గౌతమ్ రెడ్డి సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: