ఎన్టీఆర్‌పైనే బుచ్చయ్య ఆశలు.. బాబు సైడ్ అయ్యాకే...

M N Amaleswara rao
తెలుగుదేశం పార్టీలోకి ఎన్టీఆర్ రావాలని ఎప్పటినుంచో వినిపిస్తున్న డిమాండ్. ఎన్టీఆర్ టి‌డి‌పి పగ్గాలు చేపట్టాలని గత ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుంచి కొందరు కార్యకర్తలు కోరుతూనే ఉన్నారు. ఎన్టీఆర్ వస్తేనే పార్టీకి పునర్వైభవం వస్తుందని మాట్లాడుతున్నారు. ఇంకా ఓ అడుగు ముందుకేసి...కొందరు కార్యకర్తలు చంద్రబాబు, నారా లోకేష్ సభల్లో జై ఎన్టీఆర్, సి‌ఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు కూడా చేస్తున్నారు. ఆఖరికి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో సైతం ఎన్టీఆర్ టి‌డి‌పిలోకి రావాలంటూ జెండాలు కూడా వచ్చాయి. 

అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చాలా టి‌డి‌పి బ్యానర్లలో సి‌ఎం ఎన్టీఆర్ అంటూ రాసి పెడుతున్నారు. అంటే ఏ స్థాయిలో ఎన్టీఆర్ టి‌డి‌పిలోకి రావాలని కార్యకర్తలు కోరుకుంటున్నారో అర్ధమవుతుంది. కాకపోతే ఇదంతా వైసీపీ ఆడిస్తున్న డ్రామా అని కొందరు టి‌డి‌పి కార్యకర్తలు చెబుతున్నారు. టి‌డి‌పిలో చిచ్చు పెట్టడానికే కొందరు కార్యకర్తలు ఎన్టీఆర్ పేరుని వాడుతున్నారని, ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నారని, ఇప్పటిలో రాజకీయాల్లోకి రారని చెబుతున్నారు.
అయితే వాస్తవ పరిస్తితులని చూస్తే అదే నిజమనిపిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎన్టీఆర్ ఇప్పటిలో రాజకీయాల్లోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు. అలా అని టి‌డి‌పి కార్యకర్తలు ఎన్టీఆర్ కావాలంటూ చేసే డిమాండ్‌లో నిజం కూడా ఉంది. అసలు సీనియర్ నాయకుడు బుచ్చయ్య చౌదరీ లాంటి వారే ఎన్టీఆర్, పార్టీలోకి రావాలని కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ వస్తే పార్టీకి కొత్త ఊపు వస్తుందని భావిస్తున్నారు.
కానీ చంద్రబాబు తర్వాత నారా లోకేష్ టి‌డి‌పి పగ్గాలు చేపడతారని అర్ధమైపోతుంది. ఈ విషయాన్ని మాత్రం బుచ్చయ్య ఒప్పుకుంటున్నట్లు కనిపించడం లేదు. కొన్నేళ్లు చంద్రబాబు మాత్రమే పార్టీని నడిపిస్తారని, ఆయన బొమ్మ పెట్టుకునే టి‌డి‌పి ముందుకెళుతుందని, లోకేష్ ఆయనకు సపోర్ట్‌గా మాత్రమే ఉంటారని మాట్లాడుతున్నారు. అయితే చంద్రబాబు తర్వాత పార్టీ పగ్గాలు లోకేష్ కంటే ఎన్టీఆర్‌కు ఇవ్వాలని బుచ్చయ్య బాగా ఆశపడుతున్నారు. నెక్స్ట్ ఎన్టీఆర్ సి‌ఎం పీఠంలో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి బుచ్చయ్య ఆశలు నెరవేరతాయో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: