మొబైల్ లో ఇవి సేవ్ చేసుకుంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త?

praveen
ఈ మధ్యకాలంలో మొబైల్ వాడకం ఎలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి రోజూ గంటల తరబడి ప్రతి ఒక్కరు మొబైల్ వాడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మొబైల్ అరక్షణం పాటు అరచేతిలో లేకపోయినా కూడా ఇక ఆందోళన చెందుతూ వుంటారు చాలామంది. మొబైల్ వాడకం పెరిగిపోయింది. ప్రస్తుతం మనకు ఏది కావాలన్నా అర చేతిలో ఉన్న మొబైల్ లోనే దొరుకుతుంది  అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు ఏకంగా మొబైల్ కారణంగానే కొన్ని ఊహించని షాక్ లు తగులుతున్నాయ్. మొబైల్ కారణంగానే కొన్ని కొన్ని సార్లు ఏకంగా సైబర్ నేరగాళ్ల బారిన పడే అవకాశం ఉంటుంది.

 ఇటీవల కాలంలో ఆర్థిక లావాదేవీల విషయంలో ఎంత టెక్నాలజీ పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పటిలా ఎవరూ బ్యాంకుకు వెళ్లి లావాదేవీలు జరపడం లేదు. ఆన్లైన్ పేమెంట్ యాప్స్ లేదా డెబిట్ క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలు జరుపుతున్నారు. ఇలా అటు ఆర్థికపరమైన లావాదేవీలు మారిపోయిన నేపథ్యంలో ఎంతో మంది ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఎన్నో ముఖ్యమైన పాస్వర్డ్లను అటు మొబైల్లో సేవ్ చేసుకోవడం లాంటివి కూడా చేస్తున్నారు. కానీ ఇలా చేసుకోవడం మాత్రం తీవ్రమైన పరిణామాలకు దారితీస్తోందని నిపుణులు సూచిస్తున్నారు.డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు, పిన్ నెంబర్ లేదా ఇతర కీలక సమాచారాన్ని మొబైల్లో  భద్రపరచడం వల్ల సైబర్ నేరగాళ్లు ఎటాక్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

 ఇటీవలే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా లోకల్ సర్కిల్స్ చేసిన సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా 393 జిల్లాలోని 24 వేల మందికి అభిప్రాయాలను సేకరించింది ఇక ఈ సర్వే ప్రకారం 8150 మందిలో 29 శాతం మంది తమ క్రెడిట్ డెబిట్ ఏటీఎం పిన్ నెంబర్ లను మరికొన్ని ముఖ్య సమాచారాన్ని కూడా మొబైల్ మొబైల్ లోనే సేవ్ చేసుకుంటున్నట్లు తేలింది. అంతేకాదు సర్వేలో చాలామంది కీలకమైన సమాచారాన్ని తాము గుర్తుంచుకున్నాం అని చెబితే మరికొంతమంది మాత్రం లిఖితపూర్వకంగా మొబైల్లో భద్రపరచుకున్నాము అని చెప్పినట్లు తెలుస్తోంది. ఇలా ఎంతో మంది నేటి రోజుల్లో మొబైల్లోనే కీలకమైన సమాచారాన్ని ఉంచడం వల్ల చివరికి సైబర్ నేరగాళ్ల బారినపడి మోసపోయే పరిస్థితులు వస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: