ఎల్పిజి గ్యాస్ వాడే వారికి గుడ్ న్యూస్?

praveen
నేటి రోజుల్లో గ్యాస్ వినియోగం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అయితే అటు గ్యాస్ వినియోగదారులకు సత్వర సేవలు అందించేందుకు గ్యాస్ ఏజెన్సీలు కూడా ఎప్పటికప్పుడు అందుబాటులోనే ఉంటున్నాయి. కానీ కొన్ని ప్రాంతాలలో గ్యాస్ ఏజెన్సీలకు సంబంధించిన సేవలు ఎప్పుడూ జాప్యం జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఒక డిస్ట్రిబ్యూటర్ నుంచి మరో డిస్ట్రిబ్యూటర్ కి మారాలి అని అనుకున్నప్పటికీ పెద్ద ప్రాసెస్ కు భయపడి అందరూ వెనక అడుగు వేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ సమస్య తీరిపోనుందని తెలుస్తోంది.

 ఒకవేళ మీరు మీ గ్యాస్ సిలిండర్ డిస్ట్రిబ్యూటర్ నుంచి సమస్యలను ఎదుర్కుంటూ ఉంటే.. ఇక గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ చాలా రోజులకు డెలివరీ చేయడం లాంటివి చేస్తూ ఉంటే ఇక వేచి చూడాల్సిన అవసరం లేదు. వెంటనే సులభంగానే డిస్ట్రిబ్యూటర్ ను మార్చుకునే అవకాశం ప్రస్తుతం మీ కోసం అందుబాటులో ఉంది. ఇటీవలే కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. ఎల్పిజి సిలిండర్ వాడే వారికి ఈ కొత్త రూల్స్ తో ఎంతగానో ఊరట కలుగుతుంది. ఇక ఇటీవల వెలుగులోకి వచ్చిన కొత్త రూల్స్ ప్రకారం మీకు నచ్చిన డిస్ట్రిబ్యూటర్ కి మారేందుకు అవకాశం ఉంటుంది.


 మరీ ముఖ్యంగా కొంతమంది సిలిండర్ బుక్ చేసిన చాలా రోజుల వరకు డెలివరీ ఇవ్వరు. ఇలా కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు డెలివరీ చేయడంలో జాప్యం చేస్తూ ఉంటారు. మీరు కూడా ఇలాంటివి సమస్యతో బాధపడుతూ ఉంటే వెంటనే డిస్ట్రిబ్యూటర్ మార్చుకుని వేరే డిస్ట్రిబ్యూటర్ నుంచి సిలిండర్ పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇండియన్ ఆయిల్ తాజాగా ఈ విషయాన్ని అధికారిక సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది. మీకు నచ్చిన డిస్ట్రిబ్యూటర్ నుంచి గ్యాస్ సిలిండర్ పొందవచ్చు అని తెలిపింది. డిస్ట్రిబ్యూటర్ ను ఎంపిక చేసుకొని గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే సరిపోతుంది అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇండియన్ ఆయిల్ వన్ యాప్ ద్వారా సులభంగా ఇలా సిలిండర్ బుక్ చేసుకోవచ్చు అంటూ ఇక ఇండియన్ ఆయిల్ అధికారిక సోషల్ మీడియాకు వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: