తెలంగాణాలో ఆ కులానికి 25 లీటర్ల పెట్రోల్ ఫ్రీ...?

Gullapally Rajesh
తెలంగాణాలో భారతీయ జనతా పార్టీ కాస్త గట్టిగా ఫోకస్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా ఘాటు విమర్శలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ లో గౌడ గర్జన సభ నిర్వహించింది బిజెపి. హాజరైన కేంద్ర మంత్రి మురళీధరన్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ గౌడ సామాజిక వర్గానికి చేసింది ఏముంది అని ఆయన నిలదీశారు. ఎన్ని హామీలు ఇచ్చారు... ఎం చేశారు అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేవలం ఎన్నికల వేళ హామీలు ఇవ్వడం తప్ప చేసేది ఎం లేదు అన్నారు.
అయిదేళ్ళలో కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉండి దళిత సమాజం కోసం చేసింది ఏముంది అని ప్రశ్నిస్తూ ఇప్పుడు చేస్తాడా అంటూ మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం లో 28 మంది బలహీన వర్గం అని ఆయన పేర్కొన్నారు. 12 మంది దళిత వర్గం అని అన్నారు. 22 మంది ఎస్టీ వర్గాల ప్రజలకు మంత్రి పదవులు ఇచ్చారు  అని అన్నారు. మరి కేసీఆర్ ఎంత మందిని మంత్రి వర్గాన్ని ఇచ్చారు అని ఆయన ప్రశ్నించారు. దేశంలో మోదీ గారి ఆలోచన దళిత, అట్టడుగు వర్గాలకు బావుండలని కోరుకుంటారు అని అన్నారు.
అలా కేంద్రం చేసిన ఆలోచనను మార్చి కేసీఆర్ ఈనాడు దళిత బంధు పథకం పెట్టారు అని  వ్యాఖ్యలు చేసారు. అదేవిధంగా గౌడ బంధు, బడుగు బలహీన వర్గాలందరికి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న అన్నారు. గౌడ ఆత్మీయ సభలో పాల్గొన్న నాకు తెలుసు అని... అత్యంత కష్టమైన వృత్తి గౌడ వృత్తి అన్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే  గౌడ కులస్తులకు మోటార్ సైకిల్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న అన్నారు. ప్రతి నెలకు 25 లీటర్ల పెట్రోల్ రాష్ట్ర ప్రభుత్వం గౌడ సమాజానికి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్న అని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

trs

సంబంధిత వార్తలు: