హుజురాబాద్ లో చేతులెత్తేసిన కాంగ్రెస్ ?

Veldandi Saikiran
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో.. హాట్ టాపిక్ గా మారింది హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి దృష్టి  ఈ హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక పైనే ఉంది. ఇక అటు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు... హుజూరాబాద్ నియోజకవర్గం లోని పాగా వేశాయి. ఎలాగైనా  హుజూరాబాద్ నియోజకవర్గం లో విజయం సాధించాలని కృత నిశ్చయంతో... జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి పార్టీ లు. ఇక ఇందులో అధికార టిఆర్ఎస్ పార్టీ మరియు బిజెపి పార్టీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అటు అభ్యర్థిని ప్రకటించి... నాలుగు అడుగులు ముందుకేసింది అధికారం టిఆర్ఎస్ పార్టీ. 

ఇక బిజెపి అభ్యర్థిగా ఈటల రాజేందర్ లేదా ఆయన సతీమణి జమున ఉండే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే... హుజూరాబాద్ నియోజకవర్గం లో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారం మరియు ప్రభావం కనిపించడం లేదు. అసలు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైనే క్లారిటీ లేకుండా పోయింది. ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ బరిలో దించే అవకాశం ఉన్నట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి. అయితే కొండా సురేఖను ప్రకటిస్తున్నారన్న వార్తలు రాగానే కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి.  కొంతమంది పార్టీ నేతలు కొండా సురేఖ అభ్యర్థిత్వాన్ని సపోర్ట్ చేస్తూ ఉంటే... మరికొంతమంది నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

దీనికి ముఖ్య కారణం కొండా సురేఖ నాన్ లోకల్. కొండా సురేఖ సొంత నియోజకవర్గం హుజరాబాద్ పక్కనే ఉన్న పరకాల.  పక్క నియోజక వర్గం నుంచి అభ్యర్థిని తీసుకురావడం ఏంటని పార్టీ నేతలు అనుకుంటున్నారట. హుజూరాబాద్ నియోజకవర్గం లో ఎటువంటి లోకల్ లీడర్ ను నిలబడితేనే కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు ఉంటాయని ఆ నేతలు భావిస్తున్నారట. అంతేకాదు కొండా సురేఖ ను ఫైనల్ చేస్తే... తాము కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసే ఆ ఆలోచనను విరమించు కుంటామని అని హెచ్చరిస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం లోని కృష్ణా రెడ్డి లాంటి  లోకల్ లీడర్స్ ఉన్నారని... ఈ నేపథ్యంలో నాన్ లోకల్ అభ్యర్థి ఎందుకని ప్రశ్నిస్తున్నారట. దీంతో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కి హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక పెనుసవాలుగా మారిందనే చర్చ జరుగుతోంది. ఇలాంటి తరుణంలో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహరచనలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: