గులాబీ ముల్లు : ఢిల్లీ గల్లీలో "చింతపండు" కేసు

RATNA KISHORE
 
కేసీఆర్ ను తిట్టడంలో మల్లన్న ముందుంటారు. మల్లన్నను తిట్టడంలో కేసీఆర్ మాత్రం పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. ఇప్పటిదాకా జరిగిందే ఇది. కానీ ఇటీవల క్యూ న్యూస్ వ్యవహారాలపై నిఘా పెంచారు. ఇదే సందర్భంలో పోలీసులూ తమ పని తాము చేసుకు పోయేందుకు కేసీఆర్ కొన్ని సూచనలు ఇచ్చారు. ఇప్పటివరకూ తన కనుసన్నల్లో మల్లన్న ఉన్నారన్న అపోహలను కొట్టిపారే సేందుకు చేసిన ప్రయత్నాల్లో భాగంగానే  కేసీఆర్ పోలీసుల ఉచ్చు బిగింపు అన్నది చేశారని కొందరు పరిశీలకుల అంటున్నారు. ఈ తగాదాలను కాస్త ఢిల్లీ వరకూ తీసుకువెళ్లి మల్లన్న కొత్త మలుపు ఒకటి తీసుకువచ్చారు. నేషనల్ బీసీ కమిషన్ తన గోడు చె ప్పుకుని కొత్త వివాదం రేపారు. దీంతో తెలంగాణ పోలీసులపై సీరియస్ అయిన బీసీ కమిషన్ తమ ఎదుట హాజరుకావాలని నోటీ సులు కూడా ఇచ్చిందని సమాచారం. రేపో మాపో ఈ కేసు సమన్ల వరకూ వెళ్తుందని తెలుస్తోంది.

చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను హీరో  చేయాలన్న ఆలోచన బీజేపీకో, కాంగ్రెస్ కో ఉందని అనుకోలేం కానీ వా ళ్లంతా ఆయన తిడితే సంతోషించినవారే! పాపం ఆయన ఆఫీసులపై దాడులు అయితే వీళ్లంతా ఢిల్లీ కిపోయి గొడవపడకుండా ప్రే క్షక పాత్రకు పరిమితం అయిపోయారు. దీంతో మల్లన్న పోరుకు కేసీఆర్ చెక్ పెట్టేందుకు సులువు అయింది. కేసీఆర్ కూడా చాలా కాలం భరించి, భరించి బరి తెగించిన నవీన్ పై పోలీసులతో నియంత్రించాలని అనుకున్నారు.ఇవి ఎలా ఉన్నా పోలీసులు మాత్రం కేసీఆర్ చెప్పిన విధంగా నడుచుకుని మల్లన్నపై వేధింపులు చేస్తున్నారన్నది ఓ విమర్శ. కానీ మల్లన్న వెనుక నిన్నటి దాకా అ దృశ్యశక్తిలా ఉన్న టీఆర్ఎస్ ఉన్నపళాన తన దారి సెపరేటు అని చెప్పడం తగదని ఓ వ్యాఖ్య. కేసీఆర్ దగ్గర డబ్బులు గుంజుకుని రాజకీయం చేసే మల్లన్న కు మాట్లాడే హక్కే లేదని కొందరు మల్లన్న వ్యతిరేకులు వినిపించే వాదన. ఇప్పటిదాకా కేసీఆర్ డబ్బు లు ఇచ్చారో, ఇవ్వలేదో కానీ మల్లన్న మాత్రం నోటికి అడ్డన్నది లేకుండా తిట్టడం మాత్రం ఆపడం లేదు.

ఈ దరిద్రగొట్టు ఎపిసోడును ఆయన గొట్టం మీడియా ప్రతిరోజూ బ్యాడ్ క్యాస్ట్ అదేలేండి బ్రాడ్ క్యాస్ట్ చేస్తుండడంతో కేసీఆర్ కు మరిం త తిక్కరేగి మరోసారి ఆయనను అరెస్టు చేయించేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారని వినికిడి. ఈ కథ ఎలా ఉన్నా ఢిల్లీ పెద్దలు బీసీ క మిషన్ పేరిట ఉన్న పెద్దలు మల్లన్నకు అండగా నిలవడం అన్నదే ఇప్పటి ఆసక్తికర పరిణామం. మల్లన్న కేసులో తెలంగాణ పో లీసులు అతి చేస్తున్నారో లేదో కానీ ఆయన ఇదే అదునుగా సానుభూతి రాజకీయాలు నడుపుతున్నాడు అన్న విమర్శ కూడా ఉంది. అదే గనుక లేకపోతే తెలంగాణ వాకిట మల్లన్న మనుగడే ప్రశ్నార్థకం అవుతుందన్నది కొందరి వాదన. ఇవన్నీ కాకుండా మల్లన్న నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తే జనం మెచ్చుకుంటారని, అలా కాకుండా  వక్రబుద్ధి రాజకీయాలు చేస్తున్న కార ణంగానే ఆయనకు బ్యాడ్ ఇమేజ్ రోజురోజుకీ పెరుగుతోందని కొందరి వాదన. ఈ  చింత పండు నవీన్ చిత్తశుద్ధిపైనే ఎన్నో అనుమా నాలు తమకు ఉన్నాయని ఓ అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా గులాబీ దండులో ఉన్నాయి. అవి తప్పని నిరూపించు కోవాల్సిన బాధ్యత నవీన్ దే!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: