వేల కిలోల టమాటా రోడ్డు పక్కన పారబోసారు.. ఎందుకో తెలుసా?

praveen
భూ తల్లినే నమ్ముకుని ఆరుగాలం కష్టపడి చెమటోడ్చి పండించి.. దేశానికి అన్నం పెట్టే రైతులందరికీ కూడా అడుగడుగునా ఎన్నో రకాల ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి.  కొన్నిసార్లు ప్రభుత్వాల నుంచి కొన్ని సార్లు ప్రకృతి నుంచి..  ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని పంట పండించిన  తర్వాత ఇక రైతుకు నిరాశే ఎదురవుతుంది. ముఖ్యంగా టమాటా రైతుల పరిస్థితి అయితే ఎప్పుడు ఎలా మారిపోతూ ఉంటుదో అస్సలు ఊహించని విధంగా ఉంటుంది.  సాధారణంగా ప్రతి వంటకంలో టమాటా తప్పనిసరిగా వాడుతూ ఉంటారు. టమాటా లేనిదే దాదాపుగా అసలు వంటలు చేయరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ఇలా ప్రతి ఒక్కరికీ అత్యవసరమైన టమాటా పండించే రైతుల పరిస్థితి మాత్రం రోజురోజుకు దారుణంగా మారిపోతుంది. ఒక్కసారిగా టమాట ధరలు పెరిగి భారీగా డిమాండ్ ఏర్పడటంతో మురిసిపోయే టమాటా రైతులు.. ఇక ఆ తర్వాత ఒక్కసారిగా టమాట ధరలు పడిపోవడంతో అయోమయంలో పడి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం మహారాష్ట్రలో టమాటా రైతుల పరిస్థితి ఇలాగే ఉన్నట్లు తెలుస్తుంది. ముందుకి వెళ్తే నుయ్యి వెనుకకు వెళ్తే గొయ్యి అన్న చందంగా ప్రస్తుతం టమాటా రైతుల పరిస్థితి మారింది.  ప్రస్తుతం టమాటా కు ఉన్న ధరకు మార్కెట్కు తీసుకువెళ్లి అమ్ముకోలేక ఇక చివరికి కష్టపడి పండించిన పంటను వదులుకోలేక  రైతులందరూ అయోమయంలో పడిపోతున్నారు.

 ఈ క్రమంలోనే ఏకంగా గిట్టుబాటు ధర లేకపోవడంతో మహారాష్ట్రలో ఇటీవలే కొన్ని టన్నుల టమాటాలు రోడ్డు పక్కన పారబోసిన ఘటన  ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ సీజన్లో భారీగా వర్షాలు కురవడం వల్ల పలు జిల్లాలో టమాటా దిగుబడి ఒక్కసారిగా పెరిగిపోయింది. అధిక దిగుబడి ఒక్కసారిగా పెరిగిపోవడంతో టమాట ధర పడిపోయింది  ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లో కిలో టమాట ధర కేవలం రెండు నుంచి మూడు రూపాయలు మాత్రమే పలుకుతోంది. ఇక టమాటా రైతులు రవాణా ఖర్చు పెట్టుకుని మార్కెట్కు తీసుకెళ్ళిన లాభం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో నాసిక్, ఔరంగాబాద్ ప్రాంతాలకు చెందిన రైతులు తాము పండించిన పంటను గిట్టుబాటు ధర లేకపోవడంతో బరువెక్కిన హృదయాలతో రోడ్ల పక్కనే పారబోసే పరిస్థితి  ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: