పాకిస్తాన్ లో తాలిబన్ల రాజ్యం.. మొదలైన చిచ్చు?

praveen
ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ పాకిస్తాన్. ఎన్నో దశాబ్దాల నుంచి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది.  ప్రపంచ దేశాలలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం తప్పుగా భావించకుండా  భవిష్యత్తు తరాలకు మత రాజ్యాన్ని అందించడం కోసం తాము ఆయుధాలను తయారు చేస్తున్నాము అంటూ గొప్ప గా భావిస్తూ ఉంటుంది పాక్. అయితే పాముకు పాలు పోసి పెంచినంతమాత్రాన కాటూ వేయకుండా ఉండదు కదా. అలాగే.. పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాదమే రోజురోజుకీ పాకిస్థాన్కు ప్రమాదకరంగా మారి పోతుంది.

 ఈ క్రమంలోనే ఏకంగా ప్రస్తుతం పాకిస్థాన్లో ఉన్న కొంతమంది తిరుగుబాటు చేస్తూ అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్లో ఆదిపత్యాన్ని సాధించిన తాలిబన్ల లోని ఒక వర్గం కన్ను పాకిస్తాన్పై పడినట్లు తెలుస్తోంది.  ఉగ్రవాదులకు మరో రూపమైన తాలిబాన్లకు పాకిస్థాన్ మద్దతు ఇస్తుంది. కానీ తాలిబన్ల లోని ఒక వర్గం మాత్రం అటు పాకిస్థాన్ తీరును వ్యతిరేకిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల ఏకంగా సైనికులపై దాడి చేసి కొంత మంది సైనికులను సైతం ప్రాణాలు తీశారు తాలిబన్లు.

 ఇప్పుడు మరో సంచలన ఘటన చోటుచేసుకుంది పాకిస్తాన్ లో. ఇక ఇప్పుడు పాకిస్తాన్ లో కూడా తాలిబన్ రాజ్యపు చిచ్చు మొదలవుతుంది అన్నది తాజా ఘటనతో తెలుస్తోంది. ఐఎస్ఐ కార్యాలయానికి సమీపంలో ఉన్న లాల్ మసీదుపై ఇటీవలే ఏకంగా తాలిబన్ల జెండా ఎగరడం సంచలనంగా మారిపోయింది. సాధారణంగా లాల్ మసీదు దగ్గర ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అదే పాకిస్తాన్ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది   దీన్ని బట్టి చూస్తే అటు లాల్ మసీదుపై తాలిబన్ల  జెండా ఎగరడం తో ఇక పాకిస్తాన్ లో కూడా తాలిబన్లు రాజ్యం కావాలని పిలుపు మొదలయింది అని .. ఇక పరిణామాలు ఎక్కడికి వరకు వెళ్తాయి కూడా ఊహించని విధంగా ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: