కొవిడ్-22 వెరీ డేంజర్.. షాకింగ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు..!

NAGARJUNA NAKKA
భారత్ లో థర్డ్ వేవ్ వస్తుందని వార్తలు వస్తుంటే.. తాజాగా శాస్త్రవేత్తలు మరో బాంబు పేల్చారు. 2022లో కొవిడ్ సూపర్ వేరియంట్ మన దేశాన్ని కుదిపేస్తుందని అంటున్నారు. దాన్ని కొవిడ్-22గా పిలుస్తున్నారు. టీకా తీసుకోని వారిపై అది తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని.. వారు సూపర్ స్పైడర్లుగా మారతారని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం డెల్టా వేరియంట్ కంటే అది ఎక్కువ ప్రమాదకరమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇక కేరళలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దేశంలో నమోదవుతున్న కేసుల్లో సగానికి పైగా కేసులు కేరళలోనే వస్తున్నాయి. గడిచిన 24గంటల్లో 30,007కేసులు నమోదయ్యాయి. 162మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 20,134కు చేరుకుంది. ప్రస్తుతం కేరళలో లక్షా 81వేల 209యాక్టివ్ కేసులుండగా.. పాజిటివిటీ రేటు 18.03శాతంగా ఉంది. గడిచిన 24గంటల్లో 1,66,397శాంపిల్స్ పరీక్షించారు.
మరోవైపు కొవిషీల్డ్ రెండు డోసుల వ్యవధిని తగ్గించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుండగా.. జాతీయ సాంకేతిక సలహా బృందంతో చర్చించాక దీనిపై నిర్ణయం తీసుకోనుంది. అయితే కోవీ షీల్డ్ రెండు డోసుల మధ్య ప్రస్తుతం 84రోజుల వ్యవధి ఉంది. అటు కొవాగ్జిన్ రెండు డోసుల మధ్య వ్యవధి 28-42రోజులుగా ఉంది.
మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ జోరుగా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను వైరస్ పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో పాటు.. తగినంత టీకాలను సరఫరా చేస్తోంది. కరోనా కట్టడికి తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రజలు కూడా కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తోంది. వ్యాక్సిన్ పట్ల అపోహలు వద్దనీ.. తప్పనిసరిగా అందరూ తీసుకోవాలని చెబుతోంది.
మొత్తానికి సైంటిస్టులు ప్రకటించిన కొవిడ్-22 వార్త ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే కరోనా వైరస్ తో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది కోలుకున్నా.. ఇంకా అనారోగ్య సమస్యలు వారిని వెంటాడుతున్నాయి. ఇప్పుడు కొత్తగా కొవిడ్-22 ప్రజల్లో టెన్షన్ రేపుతోంది. దాని లక్షణాలు తీవ్రంగా ఉంటాయని చెప్పడంతో భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: