వామ్మో జుట్టు మాఫియా మరో రేంజ్ లో ఉందిగా...?

Sahithya
రెండు తెలుగు రాష్ట్రాల్లో వెంట్రుకల మాఫియా అనేది ఇప్పుడు సీరియస్ గా మారింది. వెంట్రుకల స్మగ్లింగ్ వెనుక చైనీస్ బెట్టింగ్ ముఠా ఉందని అధికారులు గుర్తించారు. చైనీస్ బెట్టింగ్ యాప్ ల ద్వారా వచ్చిన సొమ్మును హవాలా రూపంలో వెంట్రుకల వ్యాపారులకు 16 కోట్లు చెల్లించారు అని అధికారులు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వెంట్రుకల వ్యాపారులపై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. హైదరాబాద్ , గౌహతి కోల్ కత్తా లో ఉన్న దేశీయ వెంట్రుకల వ్యాపారులకు విదేశీ వెంట్రుకల వ్యాపారులకు సత్సంబంధాలు ఉన్నాయని విచారణలో వెల్లడి అయింది.
వెంట్రుకలను సేకరించి విదేశీ వ్యాపారులకు విక్రయిస్తున్నట్టు ఆధారాలు సంపాదించారు. మణిపూర్ మిజోరాం ప్రాంతాలనుండి రోడ్డు మార్గం ద్వారా మయన్మార్ కు స్మగ్లింగ్ చేస్తున్నారని గుర్తించారు. అంతిమంగా చైనాకు ముడి వెంట్రుకలు చేరుతున్నాయని చైనాలో ఈ వెంట్రుకలను చైనీస్ హెయిర్ గా ముద్రవేసి విక్రయం జరుపుతున్నారని గుర్తించారు. దిగుమతి సమయంలో లో 28 శాతం టాక్స్ నివారించడంతో పాటు ఎగుమతి సమయంలో లో టాక్స్ ను ప్రోత్సాహంగా సంపాదిస్తారు అని విచారణలో గుర్తించారు.
ఈడీ  నిర్వహించిన సోదాల్లో 12 మొబైల్ ఫోన్ ల తో పాటు మూడు ల్యాప్ టాప్ లు, ఒక కంప్యూటర్, ఒక డైరీ ,అకౌంట్ పుస్తకాలను మరియు లూజ్ షీట్ లను స్వాధీనం చేసుకుందని వార్తలు వస్తున్నాయి. వెంట్రుకల వ్యాపారుల సోదాల్లో ఉన్న మొత్తం 2.9 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తుంది. అని 2.9 కోట్ల కు సంబంధించిన సరైన పత్రాలను వ్యాపారులు చూపించలేదు. హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారులు చైనీస్ యాప్ ద్వారా వచ్చిన 3.38 కోట్ల రూపాయలను విదేశీ వ్యాపారులకు విక్రయించారు. హైదరాబాద్లో ఉంటూ కొంతమంది మయన్మార్ పౌరులు స్థానిక మానవ వెంట్రుకలను కొనుగోలు చేసి ఆపై విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మయన్మార్ ,బంగ్లాదేశ్ మొదలైన దేశాలకు ఎగుమతి చేస్తున్న వెంట్రుకలకు ఇన్వాయిస్ చేయడం లేదని ఈడీ  అనుమానoవ్యక్తం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: