కరోనా భర్తను తీసుకుపోయినా... 87 ఏళ్ళ వృద్దురాలి పోరాటం మాత్రం శెభాష్...!

Sahithya
కరోనా కేసులు పెరగడం పరిస్థితి రోజు రోజుకి దారుణంగా మారడం, చాలా మంది ఆర్ధికంగా ఇబ్బంది పడటం కరోనా రోగులు తినడానికి కూడా కష్టాలు పడటం వంటివి ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం. కరోనా రెండో వేవ్ చాలా మంది కుటుంబాల్లో కష్టాల్లో నిమిపింది అనే మాట వాస్తవం. అయితే ఒక వృద్దురాలు మాత్రం తన భర్త కరోనా రెండో వేవ్ లో ప్రాణాలు కోల్పోయినా కరోనా బాధితులకు అండగా నిలబడాలని నిర్ణయం తీసుకున్నారు. ఆరు దశాబ్దాల దాంపత్యం మహమ్మారి కారణంగా అర్ధంతరంగా ఆగిపోయినా సరే ఆమె ఎక్కడా వెనకడుగు వేయలేదు.
87 ఏళ్ల ఉషా గుప్తా భర్త రాజ్ కుమార్ వైరస్ బారిన పడ్డారు. ఢిల్లీ లోని బాత్రా ఆసుపత్రిలో చేరి  27 రోజుల పోరాటం తరువాత, ఉష భర్త మరణించారు. ఈ సమయంలో ఆసుపత్రిలో, రోగులు మరియు వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న నిస్సహాయతను ఉష చూసింది. ఆమె భర్త రెండుసార్లు ఆక్సిజన్ లేకపోవడంతో బాధపడ్డారు. ఆక్సీజన్ లేకపోవడం తమను చాలా ఇబ్బంది పెట్టిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. ఆర్థికంగా బలంగా లేని కుటుంబాలను కరోనా ఎలా ప్రభావితం చేస్తుందో తాను చూశానని ఉష  మీడియాకు వివరించారు.
హాస్పిటల్‌లో ఆమె చూసిన బాధ ఆమె జీవితానికి కొత్త అర్థాన్ని ఇచ్చింది. అక్కడి నుంచి ఇంట్లో ఊరగాయలను తయారు చేయడం ద్వారా డబ్బులు సంపాదించి పేదలకు సహాయం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఉష 'పిక్ల్డ్ విత్ లవ్' జులై 2021 లో ప్రయాణం ప్రారంభించారు. అక్కడ నుంచి ఆమె విక్రయించడం మొదలుపెట్టి పేదలకు అండగా నిలబడ్డారు. వెంచర్ ప్రారంభించడానికి ప్రేరణ ఆమె మనవరాలు అని చెప్పింది. ఢిల్లీలో పీడియాట్రిషియన్ అయిన రాధిక బాత్రా... తన అమ్మమ్మకు సహకరించారు. అవసరమైన వస్తువులు- తాజా పదార్థాలు, సీసాలు, లేబుల్ ప్రింటర్‌లు ఇతర వస్తువులు అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: