పుట్టెడు కష్టాల్లో టీడీపీ... వీళ్ళు ఎందుకు సైలెంట్...?

Gullapally Rajesh
టీడీపీ
లో గత కొంతకాలంగా అసంతృప్తి పెరుగుతుంది అనే మాటలు ఎక్కువగా వినబడుతున్నాయి. కొంతమంది కీలక నాయకులు ప్రజల్లోకి వెళ్లకపోవడం మీడియా సమావేశాలు నిర్వహించకపోవడం అధికార పార్టీకి ఘాటుగా సమాధానం చెప్పకపోవడం వంటి పరిణామాలు పార్టీ అధిష్టానాన్ని అదేవిధంగా కార్యకర్తలను బాగా కలవరపెడుతున్న అంశంగా చెప్పుకోవచ్చు. చాలామంది కీలక నాయకులు ఈ మధ్యకాలంలో సైలెంట్ అయిపోయారు. తనను అరెస్టు చేసిన తర్వాత దూళిపాళ్ల నరేంద్ర పెద్దగా మీడియా ముందుకు రావటం లేదు.
అదే విధంగా నాలుగు రోజులు హడావుడి చేసిన ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ కూడా పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయటం లేదు. అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు కూడా పెద్దగా ప్రజల్లోకి రాకపోవడం పార్టీ నాయకులను అరెస్టు చేసిన సరే స్పందించక పోవడం వంటివి ఇబ్బంది పెడుతున్నాయి. ఇటీవల కొంతమంది నాయకులను అధికార పార్టీ నేతలు ఇబ్బంది పెట్టారు అయినా సరే అచ్చెన్నాయుడు నుంచి అనుకున్న విధంగా స్పందన లేదనేది టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్న మాట.
కృష్ణ, గుంటూరు అదేవిధంగా ప్రకాశం జిల్లాలకు సంబంధించి అచ్చెన్నాయుడు పెద్ద జోక్యం చేసుకోవడం లేదు అని కొంతమంది అంటున్నారు. అదే విధంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహారంలో కూడా పెద్దగా జోక్యం చేసుకోలేదు. అక్కడి జిల్లా, స్థానిక నాయకులు అదేవిధంగా విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ లాంటి వాళ్లు మాత్రమే ఈ వ్యవహారంలో తలదూర్చి బుచ్చయ్యచౌదరిని బుజ్జగించారు. అయినా సరే ఆయన మాత్రం ఈ విషయంలో ఫోన్ చేసి మాట్లాడటం కోసం మాత్రమే పరిమితమయ్యారు. గతంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేసి వార్తల్లో నిలిచిన ఆయన సైలెంట్ గా ఉండటం పార్టీ అధిష్టానాన్ని కలవరపెడుతోంది. అదేవిధంగా కొంతమంది సీనియర్ నేతలు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం విశేషం. మరి భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: