బాలిక కంట్లో నుండి ఇసుక.. వామ్మో ఏం వ్యాదో తెలుసా?

praveen
మనిషి శరీరం లో ఎంతో సున్నితమైన అవయవాల లో కళ్ళు కూడా ఒకటి. అంతే కాదు మనిషి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కళ్ళు ఎంతో ముఖ్యం. అయితే సాధారణం గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు  కంట్లో నలుసు పడింది అంటే ఎంతలా అల్లాడిపోతామో ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. కంట్లో దుమ్ము ధూళి లాంటిది పడితే  కన్ను తెరిచి చూడటానికి కూడా రాదు.  అలాంటిది ఏకంగా కంట్లో ఇసుక లాంటిది పడింది అంటే  ప్రాణాలు పోయినంత బాధ కలుగుతుంది.

 అలాంటిది ఏకంగా కంట్లో నుంచి ఇసుక రాలితే పరిస్థితి ఎలా ఉంటుంది. కంట్లో నుంచి ఇసుక రాలడం ఏంటండీ  ఇలా నిజంగా జరుగుతుందా ఈ విషయం చెబితే ఎవరైనా ఆశ్చర్యపోతారు. కానీ ఇక్కడ నిజం గానే జరిగింది. ఒక విద్యార్థిని కంట్లో నుంచి ఇసుక రాలిపోతోంది  అరుదైన కంటి సమస్య తో బాధపడుతున్న ఆ విద్యార్థికి ఈ సమస్య ఎంత గానో బాధ పెడుతుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన జ్యోతి అనే బాలిక ఈ అరుదైన కంటి వ్యాధితో బాధపడుతుంది. గత పదేళ్ల నుంచి జ్యోతి ఈ సమస్యతో బాధపడుతూ ఉండటం గమనార్హం.

 అయితే ఇక ఈ సమస్య పరిష్కారం అయ్యేందుకు తల్లిదండ్రులు ఎన్నో ఏళ్ళు నుండి డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది  ఇక చిన్నప్పుడే జ్యోతి తండ్రిని కోల్పోవడం తో తల్లి కూలి నాలి చేసుకుంటూ ఇక తన బాగోగులు చూసుకుంటూ ఉంది. అయితే పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్తే నయం అయ్యే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. కానీ ఇక రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి లో ఆ కుటుంబం ఇక మెరుగైన వైద్యం చేయించు కోలేక పోతుంది. అయితే కంటి నుంచి ఇసుక రావడం వల్ల తాను తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నా అంటూ జ్యోతి చెబుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Eye

సంబంధిత వార్తలు: