స్పెషల్ క్రెడిట్ కార్డ్.. ఇక ఎలాంటి వడ్డీ ఉండదట?

praveen
ప్రస్తుతం రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోతుంది.. ఒకప్పుడు డబ్బులు కావాలి అంటే బ్యాంకుకు వెళ్లి తీసుకునేవారు. తర్వాత డెబిట్ కార్డు వాడుతూ ఎటిఎం సెంటర్లకు వెళ్లి డబ్బులు తీసుకునే వారు. కానీ ఇప్పుడు మన చేతిలో డబ్బులు లేక పోయినప్పటికీ ఖర్చు పెట్టుకునే అవకాశం బ్యాంకులు కల్పిస్తూ ఉండటంతో ఎక్కువ మంది క్రెడిట్ కాజల్ ఉపయోగిస్తున్నారు. నేటి రోజుల్లో క్రెడిట్ కార్డు వినియోగం ఎంతలా పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అరెరే ఎంతో అవసరం పడింది.. ఇప్పుడు డబ్బులు లేవే.. ఇప్పుడెలా అని ఇబ్బంది పడకుండా..  డబ్బులు లేనప్పుడు కూడా ఖర్చు పెట్టుకొని ఇక డబ్బులు ఉన్నప్పుడు తీరిగ్గా కట్టుకునే సౌలభ్యం ప్రస్తుతం క్రెడిట్ కార్డు లో ఉంటుంది.

 దీంతో ఇంతకంటే ఇంకేం కావాలి అనుకుంటున్నారు అందరూ. ఇక రోజురోజుకు క్రెడిట్ కార్డు వినియోగం పెరిగి పోతూనే ఉంది. ఇక అటు కస్టమర్లను ఆకర్షించేందుకు ఎన్నోరకాల వినూత్నమైన ఆఫర్లతో వివిధ సంస్థలు క్రెడిట్ కార్డులను తెరమీదకు తీసుకు తెస్తున్నాయి. అయితే క్రెడిట్ కార్డు వినియోగిస్తున్న వారు ప్రస్తుతం ఎక్కువ వడ్డీలతో ఎంతగానో బాధ పడుతున్నారు. వడ్డీలేని క్రెడిట్ కార్డు ఉంటే బాగుండు అని కోరుకుంటున్నారు  ఇలాంటి ఒక ఆఫర్ మీ కోసం సిద్ధంగా ఉంది  ఇకనుంచి వడ్డీ లేకుండానే క్రెడిట్ కార్డును వినియోగించవచ్చు.

 స్వల్ప కాలానికి డబ్బులు కావాలి అనుకునే వారి కోసం ఈ అదిరిపోయే ఆఫర్ అద్భుతం గా సూట్ అవుతుంది అని చెప్పాలి  యూని సంస్థ కొత్త క్రెడిట్ కార్డులు తీసుకువచ్చింది. దీని ద్వారా వినియోగదారులు మూడు నెలల వరకు వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఈ యూని క్రెడిట్ కార్డు ద్వారా రుణం తీసుకుంటే మూడు నెలల్లో కట్టేయాల్సి ఉంటుంది. అలా కట్టడం ద్వారా ఎలాంటి వడ్డీ కూడా వర్తించదు. అయితే ప్రస్తుతం ఇండియాలోనే అత్యధిక కాలం పాటు వడ్డీరహిత నగదు సదుపాయం అందిస్తున్న క్రెడిట్ కార్డు ఇదే కావడం గమనార్హం. జూన్ లో పైలెట్ ప్రాజెక్టుగా ఇక ఈ క్రెడిట్ కార్డును అందుబాటులోకి తీసుకు రాగా.. ప్రస్తుతం హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగుళూరు, ఢిల్లీ, పూణే, కోల్కతా చెన్నై లాంటి కీలక నగరాల్లో అందుబాటులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: