ఈటలకు షాక్.. కీలక నేతలు జంప్ ?

Veldandi Saikiran
హుజురాబాద్‌ నియోజక వర్గం ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల కాక ముందే మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ కు దిమ్మ తిరిగే షాక్‌ తగిలింది. ఈటల రాజేందర్‌ ప్రధాన అనుచరుడి తో మరో కీలక నేత బీజేపీ పార్టీ కి గుడ్‌ బాయ్‌ చెప్పారు.   ఈటల రాజేందర్‌ ప్రధాన అనుచరుడి అయిన టి స్కాబ్ వైస్ చైర్మన్ పింగళి రమేష్ మరియు చుక్కా రంజిత్‌ బీజేపీ పార్టీకి రాజీనామా చేసారు. ఈటల రాజేందర్‌ వ్యవహారం తమకు నచ్చలేదని ఈ నేపథ్యం లోనే బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నామన్నారు. 

ఈ సందర్భంగా  టి స్కాబ్ వైస్ చైర్మన్ పింగళి రమేష్ మాట్లాడుతూ.... మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తో ఢిల్లీ లో బీజేపీ పార్టీ లో చేరిన మాకు బీజేపీ తో ఈమడ లేక ఈ రోజు రాజీనామా చేస్తున్నామని వివరించారు.  వామ పక్ష భావాలున్న మాకు బీజేపీ పార్టీ సిద్ధాంతాలు నచ్చలేదని.... కేసీఆర్ గారిని స్పూర్తి తో టీఆర్‌ఎస్‌ పార్టీ లో కొనసాగడానికి నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్న రాష్ట్రాల తోనే అభి వృద్ధి సాధ్యమని కృత నిచ్చాయం తో తెలంగాణా ను సాధించిన ఘనత కేసీఆర్ ది అని తెలిపారు.

సామాన్య కార్య కర్త గానే అందరిని కలుపుకుని టీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేస్తామన్నారు పింగళి రమేష్‌.  కేసీఆర్ ప్రవేశ పెట్టిన దళితబంధు చాలా బ్రహ్మండమని తెలియ జేశారు.  నియోజక వర్గం లో సామాన్యులకు స్థానం కల్పించిన ఘనత కూడా కెసిఆర్ ది అని వివరించారు. త్వర లో హంగులు ఆర్భాటాలు లేకుండా టీఆర్‌ఎస్‌ పార్టీ లో  చేరడానికి తేదీని ప్రకటిస్తామన్నారు పింగళి రమేష్. కాగా... హుజురాబాద్‌ నియోజక వర్గం లో పోటా పోటీ గా పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. అటు ఇప్పటికే టీఆర్‌ఎస్‌ పార్టీ తమ అభ్యర్థి ని ప్రకటించగా...  బీజేపీ మరియు కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎవరనేది తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: