షర్మిళ అను నేను : పది సీట్లు తెచ్చుకో అక్కా!

RATNA KISHORE
కలలు కనేందుకు అందరికీ అర్హతలు ఉన్నాయి. ఉంటాయి కూడా! కలలు సాకారం చేసేందుకు చేసే ప్రయత్నంలో ఎవరు ఏంట న్నది తేలిపోతుంది. ఎవరు ఎంతన్నది తెలిసి వస్తుంది. తెలంగాణ వాకిట సీఎం కలలు రేవంత్ కు,. సీతక్కకు, షర్మిలకు ఉండవ చ్చు కాదనం కానీ అందుకు సానుకూల వైఖరి వారిలో ఎలా ఉంది..ప్రజల్లో ఎలా ఉంది అన్నది ముఖ్యం. డబ్బులున్నాయి పార్టీలు పెడతాం అంటే కష్టం. పాదయాత్రల ఫార్ములాలు ప్రతిచోటా పనిచేయవు. క్లిష్టమయిన కాలాలు మాత్రమే సమర్థులు అయిన నేతలను తయారు చేయగలవు. ఇప్పుడా సంక్షోభం తెలంగాణలో ఉందా లేదా? ఎవరికి వారు ప్రశ్నించుకుంటే సమాధానం రాబట్టడం సులువు. సమాధానంతో ఏకీభావం కూడా సులువే. ఈ నేపథ్యంలో కొత్త పార్టీ వైఎస్సార్టీపీ మనుగడ ఎలా ఉంటుంది. సమానత్వం పార్టీలోనే లేదంటున్నారే మరి! ప్రజల మధ్య ఎలా తీసుకురాగలరు?



ప్రజలకు నేనున్నాను అని చెప్పడం సులువు
నేనున్నాను అని నిరూపణ చేయడం కష్టం


తెలంగాణ వాకిట మాట్లాడే పార్టీలు కొన్ని..రాజకీయ చైతన్యం తెచ్చేవి కొన్ని..సిద్ధాంత భూమిక పోషించేవి కొన్ని..కేసీఆర్ లాంటి నాయకులను నడిపించేవి కొన్ని..ఇవన్నీ ఉద్యమంలో ఉన్నాయి. ఆ రోజు ఉన్నాయి. ఆయనతోనే ఉన్నాయి. అయితే అప్పుడవి పార్టీలు కాదు కేవలం ఉద్యమ సంఘాలు. ఉద్యమ సంఘాలు ఉద్యమ పార్టీలుగా మారిపోయేయి. ఉద్యమ పార్టీలు ఉదారవాద విధానాలను అందుకుని రాజకీయ పార్టీలు అయిపోయాయి కూడా! ఇక కొత్త పార్టీ సాధించేదేంటి?


బలమైన సిద్ధాంత కర్త
ఆయన రూపొందించిన రాజ్యాంగం
గులాబీ దండుకు ఆయువు మరి మీకు?

 
వైఎస్సార్ కు ఇప్పటికీ తెలంగాణలో అభిమానులు ఉన్నారు. ఆయన ఎవరు కాదన్నా అవునన్నా కాంగ్రెస్ పార్టీ కుల గురువు.. ఆయన స్థానం చెదరదు..ఆయన స్థానంలో మరొకరు ఉంటారని ఉన్నారని ఊహించలేం. చచ్చిపోయే అవస్థలో ఉన్న పార్టీకి జవం జీవం పోసిన నేత వైఎస్సార్. ఆయన చేసిన పాదయాత్ర కారణంగానే అధికారం. అలాంటి నేతకు వారసురాలిగా షర్మిల వైఎస్సార్టీపీ ప్రారంభించినా ఆశించిన ఫలితాలు ఇప్పటికిప్పుడు రావు. రాలేవు కూడా! ఎందుకంటే ఆమె నడుచుకుంటున్న తీరే అందుకు కారణం. అం తా నేనే అని నడిపే పార్టీలకు పది అంటే పది సీట్లు వస్తే గొప్పే! కానీ ముందస్తు వ్యూహం ఏంటన్నది ఇంకా తెలియదు కనుక షర్మిల ఈ పార్టీని కలుపుతారా? నడుపుతారా ? అన్నది సందేహం. సందిగ్ధం కూడా! .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: