తాలిబాన్ల పరిణామాలపై.. మోడీ ప్రభుత్వ నిర్ణయమేంటి..?

MOHAN BABU
 ఆఫ్ఘనిస్తాన్  పరిణామాలు 20 ఏళ్లుగా దాన్ని ఆక్రమించిన అమెరికా గాని, ఇతర దేశాలు గాని ఊహించిన దాని కంటే వేగంగా జరిగిపోతున్నాయి. గతవారం ఆఫ్ఘనిస్థాన్లో  వేగంగా జరిగిన పరిణామాలు గమనిస్తే  భారత పాలకులు  అమెరికాను అంట కాగి తన విదేశాంగ విధానాన్ని అమెరికాకు తాకట్టు పెట్టడం వల్ల జరిగే నష్టం ఏమిటో అర్థమవుతుంది. ఆగస్టు 15 వ తేదీన మనం 75 స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉంటే ఆ సమయంలోనే అఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు ఆశ్రఫ్ గని నాలుగు కార్లు, హెలిక్యాప్టర్ నిండా డబ్బు తీసుకొని అఫ్గాన్ రాజధాని కాబూల్ విడిచి వెళ్లిపోయారు. గత కొద్ది వారాలుగా మెరుపువేగంతో వివిధ నగరాలు ప్రాంతాలను ఆక్రమించుకుంటూ, వచ్చినటువంటి తాలిబాన్లు కాబూల్ నగరంలోకి  సునాయాసంగా ప్రవేశించారు. తాలిబన్ల నుంచి తప్పించుకోవడానికి అమెరికా సైన్యం తుపాకి పట్టుకొని విమానాల్లో పారిపోవడం 1975లో వియత్నాం నుంచి అమెరికా దళాలు తుపాకి పట్టుకొని పారిపోవడం దృశ్యాలను తలపిస్తోంది.

 ఇరవై సంవత్సరాలుగా  అమెరికా శిక్షణ ఇచ్చి పెంచి పోషించిన అఫ్గాన్  ప్రభుత్వ సైన్యం ఎక్కడికక్కడ తాలిబన్లతో బేరసారాలు చేసుకొని లొంగిపోయింది. కొందరు విస్తారమైన మైదానాలు దాటుకుంటూ పారిపోయారు. మొత్తం మీద అమెరికా సేనలు ఉపసంహరణ తర్వాత అది నిర్మించిన ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల ముందు పేకమేడలా కూలిపోయింది అని చెప్పవచ్చు. గత ఏడాది ఫిబ్రవరి 29న ఖతర్ రాజధాని దోహాలో అమెరికాకు తాలిబన్లకు మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం అమెరికా ఆఫ్గనిస్థాన్ విడిచిపెట్టింది. అమెరికా దళాలు భద్రంగా స్వదేశానికి వెళ్లిపోవడానికి తాలిబన్లు అడ్డు పడకూడదు అన్నది ఈ ఒప్పందంలో ప్రధాన అంశంగా చెప్పవచ్చు. ఈ ఒప్పందం తరువాత ఏదో ఒక నాడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశమవుతుంది అని అందరూ భావించారు. కానీ అది ఇంత వేగంగా అమెరికాకు ఇంత తలవంపుగా జరుగుతుందని  పశ్చిమ దేశాల దౌత్య నిపుణులు  గాని , మీడియా గాని ఊహించలేకపోయారు. అమెరికా సైనిక శిక్షణ మీద నమ్మకం పెట్టుకున్న చాలామంది ఆఫ్ఘనిస్తాన్ దళాలు  చాలా కాలం పాటు తాలిబన్లను నిలువరించ కలుగుతాయని భావించారు. కానీ అమెరికా నిష్క్రమణ తర్వాత దేశంలో అంతర్యుద్ధం జరిగిందని, సిరియా మాదిరిగానే ఆ దేశాలు ఈ అంతర్యుద్ధంలో తమ తమ పాత్రను నిర్వహిస్తాయి అని భావించారు. కానీ అమెరికా కూడా ఆఫ్ఘనిస్తాన్ విడిచి పెట్టినప్పటికీ  ఏదో ఒక రూపంలో అఫ్గనిస్తాన్ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని చక్రం తిప్పవచ్చు అనుకుంది. భారతదేశం కూడా సరిగ్గా అదే అభిప్రాయంతో ఉండి ఆఫ్ఘనిస్తాన్ లో రానున్న పరిణామాలను సరిగ్గా అంచనా వేయలేకపోయిందని నిపుణులు చెబుతున్నారు.

  అయితే 20 ఏళ్ల క్రితం యుద్ధానికి దిగినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ను సుస్థిరమైన ఆధునిక దేశంగా నిర్మిస్తామని అమెరికా ప్రపంచానికి హామీ ఇచ్చింది. రెండు సంవత్సరాల్లోనే దేశం మొత్తాన్ని తన స్వాధీనంలోకి తీసుకున్నామని, ఇక దేశాన్ని సుస్థిరమైన అభివృద్ధి పథంలో పెట్టడమే తరువాయి అని అమెరికా రక్షణ మంత్రి రోనాల్డ్ రామ్స్ పేల్డ్ పేర్కొన్నారు. ఈ విధానాన్ని చూసుకుంటే  భారత ప్రభుత్వం  ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న రాయబార కార్యాలయాన్ని  మూసి వేయించి  అక్కడి సిబ్బందిని భారతదేశానికి తరలించడం చూస్తుంటే, భరత్ తాలిబన్లతో చర్చలు జరిపే అవకాశం ఏమైనా ఉందా..  ఒకవేళ జరపకపోతే తాలిబాన్ల ప్రభావం భారత్ పై పడే అవకాశం ఉందా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: