భారత్ లో : ఇక పెట్రోల్, గ్యాస్ స్టేషన్లే కాదు - ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్

praveen
రోజురోజుకు పర్యావరణ కాలుష్యం పెరిగిపోతూ ఇక మానవ మనుగడ ప్రశ్నార్థకం గా మారిపోతున్న వేళ అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాయి.  ఓవైపు దేశంలో వాహనాల సంఖ్య పెరిగి పోతూ ఉండటంతో పర్యావరణ కాలుష్యం పెరుగుతుంది . మరో వైపు అటు ఇంధన ధరలు కూడా సామాన్యులకు భారంగా మారుతూ ఉండటంతో ప్రస్తుతం ఇక ఎలక్ట్రిక్ వాహనాలు భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి అన్నది ప్రస్తుతం వినిపిస్తున్న మాట. అయితే మొన్నటి వరకు పర్యావరణ కాలుష్యం జరుగుతుందనీ.. అందరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపాలి అని ప్రభుత్వాలు ఎంత మొత్తుకున్నా విననీ జనాలు.. ఇప్పుడు మాత్రం పెట్రోల్ ధరలు సెంచరీ దాటిపోవడంతో ఇక ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.

 ఇలా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. అయితే ఎలక్ట్రిక్ వాహనాలు వాడుతున్న వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం పెట్రోల్, గ్యాస్ స్టేషన్ లను వాహనదారులకు అందుబాటులో ఉంచినట్లు గానే ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ప్రస్తుతం ప్రభుత్వాలు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయ్. ఇప్పటికే పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ దిశగా అడుగులు వేస్తూ ఉండటం గమనార్హం. ఇటీవలే మహారాష్ట్రలో  కూడా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభించేందుకు ఒక ముందడుగు పడింది.

 ఇటీవలే మహారాష్ట్ర లో మొట్ట మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభించి ప్రభుత్వం వాహనదారులు అందరికీ శుభ వార్త చెప్పింది. మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాక్రే ఇక ఈ మొదటి ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్ ని ప్రారంభించారు. అయితే పైలెట్ ప్రాజెక్టుగా దీని ప్రారంభించామని.. ఇక్కడ విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను ప్రారంభిస్తాము అంటూ మంత్రి ఆదిత్య థాక్రే చెప్పుకొచ్చారు. పర్యావరణాన్ని రక్షించేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాము అంటూ చెప్పుకొచ్చారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: