ఢిల్లీలో వైసీపీ వీక్ పాయింట్ ఏంటి?

RATNA KISHORE

సాయిరెడ్డి,మిథున్, అవినాశ్
 ఏం చేస్తున్నారు
ఒక్క ఎంపీని అడ్డుకోవ‌డం
అస్స‌లు కుద‌ర‌ని ప‌ని ?
అని అనిపిస్తుందా?
తాజాగా ఆర్థిక అత్యయిక స్థితి
ప్ర‌క‌టించే నేప‌థ్యంలో
ఆర్ ఆర్ ఆర్ చెప్పే విధంగా కేంద్రం
న‌డుచుకుంటుందా ?
ఢిల్లీలో త‌రుచూ ఆ ముగ్గురూ ఫెయిల్ అవుతున్నారు.ఇదివ‌ర‌కూ ఢిల్లీ పాలిటిక్స్ లో వైఎస్ కు ఎదురుండే కాదు.కానీ తాను న మ్మిన మ‌నుషులు పెద్ద‌గా చెప్పిన ప‌నులు చేయ‌డం లేద‌న్న కోపం జ‌గ‌న్ లో ఉంది.దీంతో సీన్ లోకి జ‌గ‌న్ రావాల‌ని యోచిస్తు న్నారు. సెష‌న్లో కూడా అనుకున్న విధంగా మాట్లాడ‌లేక‌పోతున్నారు.దీంతో ఏపీ ఎంపీలు త‌రుచూ న‌వ్వుల పాల‌వుతున్నారు. వైసీపీ క‌న్నా టీడీపీ స్పీడు పెంచ‌డంతో పాటు నిర్మాణాత్మ‌క వైఖ‌రిలో చాలా బాగుంద‌ని, రాష్ట్ర ప్రయోజ‌నాల విష‌యంలో క‌నీసం మాట్లాడుతోంద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు.
మిథున్ కానీ అవినాశ్ కానీ సాయిరెడ్డి కానీ కేంద్రాన్ని ఒప్పించ‌డంలో విఫ‌లం అవుతున్నార‌న్న‌ది వాస్త‌వం.అయితే ఢిల్లీ వ్య‌వ‌హా రాల‌కు ఓ కొత్త ఇంఛార్జ్ ను నియ‌మామించాలేమో! ఏపీ ఆర్థిక వ్య‌వ‌హారాల్లో  కేంద్రం ఇప్ప‌టికే చొర‌వ చూపుతోంద‌ని,ఇది తగదని  వైసీపీ పెద్ద‌లు అంటున్నా,బీజేపీ మాత్రం వినిపించుకోవ‌డం లేదు.మ‌రోవైపు అప్పుల చిట్టాపై ఆర్ ఆర్ ఆర్ లేఖ‌లతో దండ‌యాత్ర చేస్తున్నారు.ఇవ‌న్నీ వైసీపీకి ఇర‌కాటంలో పెట్టేవే! ఢిల్లీలో మ‌న ఎంపీలెవ్వ‌రూ ఇప్ప‌టికీ కేంద్ర శాఖ‌ల‌కు చేరువ కాలేక‌పోయిన మాట   వాస్త‌వం. అంతేకాకుండా రాష్ట్రంకు సంబంధించి  కొన్ని కీల‌క విష‌యాల్లో క‌నీసం వారితో చ‌ర్చించ‌నైనా చ‌ర్చించ‌డం  లేదు.అనవ‌స‌రంగా బీజేపీకి మ‌ద్ద‌తు ఇచ్చామా అన్న అంత‌ర్మ‌థ‌నంలో వైసీపీ ఉంది. టీఆర్ ఎస్ కూడా ఢిల్లీ కేంద్రంగా పోరాడింది లేకున్నా క‌నీసం అప్పుడ‌ప్పుడూ అయినా  మాట్లాడుతోంది.
కానీ అక్క‌డా ఇక్క‌డా విప‌క్షం మాట్లాడినంత తెలుగు రాష్ట్రాల‌కు చెందిన అధికార పార్టీలు త‌మ గొంతు వినిపించ‌డం లేదు. ఢిల్లీలో టీఆర్ఎస్ త‌రుఫున కొంత కాలం కేశ‌వ రావు రాజ‌కీయాలు నెర‌పారు. అలానే ఏపీ త‌ర‌ఫున కొంత కాలం వ‌ర‌కూ జ‌గ‌న్ కూడా రాజ‌కీయం న‌డిపారు. కానీ సీఎం అయ్యాక ఆయ‌న స్థానంలో  కేంద్రంతో మాట్లాడే బాధ్య‌త‌లు అందుకున్న సాయిరెడ్డి త‌రుచూ న‌వ్వుల పాల‌వుతున్నారు. ముఖ్యంగా ఇరిగేష‌న్ ఇష్యూస్ సా ల్వ్ చేయ‌లేక‌పోతున్నారు.గ‌తంలో అంబ‌టి, రోజా లాంటి వారు ఢిల్లీ లో కాకున్నా రాష్ట్ర రాజ‌ధానిలో అయినా మాట్లాడేవారు.కానీ జ‌గ‌న్  తీరు కార‌ణంగా ఆ ఇద్ద‌రూ సైలెంట్ అయిపోయారు. ఢిల్లీ కేంద్రంగా ర‌వీంద్ర క‌న‌క‌ మేడ‌ల‌, కింజ‌రాపు రాము లాంటి వారికి బీబీసీ తో స‌హా అన్ని మీడియాల‌తోనూ స‌త్సంబంధాలున్నాయి. కానీ వైసీపీ మీడియాను సైతం దూరం పెట్టి రాజ‌కీయం నెర‌పాల‌ని భావిస్తోంది. క‌నీసం ఛానెల్ డిబెట్ లో కూడా వైసీపీ మాట్లా డ లేక‌పోతోంది. సెష‌న్ పై అవ‌గాహ‌న లేక కొన్ని సార్లు స్పీక‌ర్ల‌తో తిట్లు తిన్న దాఖ‌లాలూ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: