అమరావతి అసైన్మెంట్ : ఈ నేలా ఈ గాలీ అంటున్న నవనీత్ కౌర్ !

RATNA KISHORE
ఎవరు ఎన్ని అనుకున్నా
తెలుగు నేలపై ఉద్యమం ఆగదు
అన్నది అమరావతి రైతు పరిరక్షణ పేరిట
పోరాడుతున్నవారి గళం
కానీ వాస్తవం ఎలా ఉన్నా
తమకు ఈ ఉద్యమం వెనుక
ఉన్నది టీడీపీ నే కనుక
ఇది పసుపు పార్టీ ఉద్యమమే
అని తేల్చేశారు కొందరు!
ఈ నేపథ్యంలో కొత్త పుస్తకం ఒకటి వచ్చింది
అలానే కొత్త గళం ఒకటి తోడయింది
ఆమెనే నవనీత్ కౌర్ తెలుగు నేలతో ఉన్న
అనుబంధం కారణంగా ఈ ఉద్యమానికి
మద్దతు ఇస్తున్నానని ప్రకటించారు

 ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే....


ద అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ అమరావతి పేరిట ఓ పుస్తకాన్ని నిన్నటి వేళ రిలీజు చేసింది అమరావతి పరిరక్షణ సమితి.ఈ వేడుకకు ఎంపీ రామూ తో సహా అమిత్ షా సోదరుడు లలిత్ షా కూడా హాజరయ్యారు.అమ్రావతి ఎంపీ నవనీత్ కూడా హాజరై ఈ పుస్తక ప్రతిని అందుకున్నారు. తెలుగు నేలతో  ఉన్న అనుబంధం కారణంగా ఆమె కూడా ఓ అతిథిగా హాజరై రైతన్న పోరుకు న్యాయమయిన డిమాండ్ల సాధనకు తనవంతు సాయం ఉంటుందని  చెప్పారీమె. ఈమెలానే మన కథానాయకులు ఎందుకు మాట్లాడరు అని మాత్రం ప్రశ్నించకండి..ఎందుకు వచ్చిన తలనొప్పి..మనం  మాట్లాడే వాళ్లనే బుర్రలో పెట్టుకుని మాట్లాడితే చాలు.. కొత్త వివాదాలు ఎన్ని వచ్చినా అవేవీ పట్టవు మన నాయకులకూ అండ్ పాలకులకూ అండ్ కథా నాయకులకూ,నాయకిలకూ కూడా .. ఈ సందర్భంగా పుస్తక ప్రచురుణ కర్త బి.సూర్యనారాయణ మాత్రం మోడీకి విన్నపం చేశారు. మా రాష్ట్రంలో ప్రజా స్వామ్యం వెంటిలేటర్ పై ఉంది..దయచేసి కేంద్రం స్పందించి ఆక్సిజన్ అందించాలి అని..అంతేకాకుండా రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ఇవాళ రోడ్డున పడి ఉన్నారని వారిని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా కేంద్రానిదే అని తేల్చారు. ఇవన్నీ విన్న నవనీత్ తన వైపు నుంచి ఉద్యమానికి మద్దతుగా సానుకూలంగానే ఉన్నానని చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: