ఏపీలో 60 వేల కోట్ల అవినీతి జరిగింది ?

Veldandi Saikiran
రాజమండ్రి : బెయిల్‌ విడుదలైన దేవినేని ఉమను రాజమండ్రి సెంట్రల్‌ జైలు వద్ద టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరియు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి కలిశారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. ఏపీలో 60 వేల కోట్ల అవినీతి జరిగిందని.. ప్యాక్షన్ నీడలో పాలన సాగుతోందన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో సూపరింటెండెంట్ ను కావాలనే బదిలీ చేశారని ఆరోపించారు.  
వైసీపీ సర్కార్‌ పై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి షాకింగ్‌ కామెంట్స్ చేశారు.

గత సంవత్సర కాలంగా కొండపల్లి లో అక్రమ మైనింగ్ పై ఆధారాలతో సహా దేవినేని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళారని... ఈ నేపథ్యంలోనే వైసీపీ గుండాలు దేవినేని పై దాడి చేశారని మండిపడ్డారు.  మైలవరం నియోజకవర్గం లో అవినీతి పై పోరాడుతున్న దేవినేనిని అక్రమంగా జైలులో పెట్టారన్నారు. హైకోర్టు దేవినేనికి ఇచ్చిన బెయిల్... ముఖ్యమంత్రి జగన్ కు చెంపపెట్టు అని చురకలు అంటించారు.  పోలీసులు పెట్టిన సెక్షన్లు అవాస్తవాలు అని... మైలవరం వీరప్ప న్ కృష్ణ ప్రసాద్ ను మాత్రమే కాదు రాష్ట్రంలో ఉన్న అక్రమ మైనింగ్ వీరప్పన్ లపై పోరాడతామని హెచ్చరించారు.

 ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జెపీఎస్ (జగన్ పర్సనల్ సర్వీస్) లు గా మారిపోయారని...  తూర్పుగోదావరి జిల్లాలో మైనింగ్ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు.  మునిగిపోయే భూముల కొనుగోలులో ఎంపీ భరత్ అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. అవినీతి అక్రమాలపై అధికారులను కోర్టుకి ఈడ్చుతామని.. కోనసీమ లో క్రాప్ హాలీడే రైతులు ప్రకటిస్తే వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు సిగ్గుపడాలని మండిపడ్డారు. మంత్రి కన్నబాబు అనర్హుడు...మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. దేవినేని జైలు నుంచి విడుదల అవుతుంటే టీడీపీ నేతలను ఎందుకు అడ్డుకుంటున్నారని.. తాడేపల్లి ప్యాలస్ లో జీతగాడు ఆదేశాలను పోలీసులు అమలు చేస్తున్నారన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: