మీసం తిప్పుతున్న రొయ్య..!

NAGARJUNA NAKKA
ఆక్వా రైతులకు టైగర్ రొయ్యలు సిరులు కురిపిస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే కోటీశ్వరులు కాకున్నా.. కనీసం లక్షాది కారులను చేస్తాయి. వాటిని నమ్ముకున్నోళ్లూ ఎప్పుడూ నష్టపోలేదు. అందుకే ఆక్వా రైతులు టైగర్ రొయ్యలను అదృష్టంగా భావిస్తారు. వెనామీకి ఆల్టర్ నేట్ గా టైగర్ రొయ్యలు కనిపిస్తున్నాయి. పెట్టుబడి తక్కువ..లాభాలు ఎక్కువ వస్తుండటంతో టైగర్ రొయ్యలపై ఆసక్తి చూపిస్తున్నారు ఆక్వా రైతులు. సాధారణంగా ఇవి ఇసుక భూముల్లో త్వరగా పెరుగుతాయి. అదే వెనామీ అయితే ఇసుక భూముల్లో నష్టాల్ని చూపిస్తాయి. టైగర్ రొయ్యల సాగు అనుకున్నట్టు జరిగితే అన్నీ లాభాలే. అంతేకాదు విదేశాలకు ఎక్స్ పోర్ట్ కూడా ఉన్నట్టుండి పెరిగిపోతుంది. కాసులు కూడా కురుస్తాయి.
ఇన్నాళ్లూ గ్యాప్ ఇచ్చిన టైగర్ రొయ్యలు.. మళ్లీ మీసం మెలేస్తున్నాయి. ఆంధ్రా టైగర్ రొయ్యలు మళ్లీ అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. దాదాపు 20ఏళ్ల క్రితం అక్వారంగంలో రారాజుగా ఉన్న ఈ రొయ్యలపై వైరస్ లు అటాక్ చేశాయి. దీంతో టైగర్ రొయ్యలకు బ్యాడ్ టైమ్ వచ్చేసింది. ఇంకేముందీ వాటికి డిమాండ్ కూడా పడిపోయింది. ఇంకేముందీ టైగర్ రొయ్యల ప్లేస్ లో వెనామీ రొయ్యలు వచ్చి చేరాయి. అయితే వెనామీలో కూడా టైగర్ లాగానే వైరస్ ల మూకుమ్మడి దాడి జరిగింది.  ఇదిలా ఉంటే మళ్లీ టైగర్ రొయ్యలపైనే రైతుల మనసు పడింది. వాటి సాగు చేయాలని ఆరాట పడుతున్నారు. ఇటీవల గుంటూరు జిల్లాలోని తీర ప్రాంత రైతులు.. దాదాపు నాలుగు వేల ఎకరాల్లో టైగర్ రొయ్యల పెంపకం చేపట్టి విజయం సాధించారు. ఇంకేముందీ నెల్లూరు, ప్రకాశం జిల్లా వాసులు కూడా ఇదే బాట పట్టారు.
అమెరికాకు చెందిన ఓ సంస్థ మళ్లీ టైగర్ టైమ్ వచ్చేందుకు కృషి చేసి.. అందులో విజయం సాధించింది. తల్లి రొయ్యలను డెవలెప్ చేసి టైగర్ రొయ్యల ఉత్పత్తిని చేపట్టింది. నెల్లూరు జిల్లాలో ఉత్పత్తిని చేపట్టి.. ఇతర జిల్లాలకు విస్తరింపజేసింది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: