ఇకపై ఆదర్శ స్మారకాలుగా ఆ మూడు..!

NAGARJUNA NAKKA
ఏపీలోని మూడు చారిత్రక కట్టడాలకు ఆదర్శ స్మారకాలుగా గుర్తింపు లభించింది. నాగార్జున కొండ, శాలిహుండం, లేపాక్షి వీరభద్ర ఆలయానికి ఈ గుర్తింపు దక్కగా.. ఆదర్శ స్మారకాల్లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. వీటి అభివృద్ది కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామన్నారు.
ప్రముఖ బౌద్ధ దార్శనికుడు ఆచార్య నాగార్జునుడు పేరుతో వెలిసింది నాగార్జున కొండ.. గుంటూరు జిల్లా మాచర్ల మండలంలో ఉంది. ఇది ఎంతో చరిత్ర కలిగిన ప్రాంతం. అంతేకాదు ఇది ఒక ద్వీపం కూడా. ఇక్కడుండే మ్యూజియం ప్రపంచంలో ఉండే ప్రదర్శన శాలలో కంటే పెద్దది. ఇందులో దంతావశేషంస కర్ణాభరణం అనేవి బుద్దునివని చెబుతారు.
బుద్ధుడు, హిందూ మతానికి సంబంధించిన ఎన్నో ముఖ్యమైన అవశేషాలు ఇక్కడ కొలువుదీరాయి. ఇదొక బౌద్ద క్షేత్రంగా విరాజిల్లుతోంది. గుంటూరు నగరం నుండి అయితే 147 కిలోమీటర్లు.. హైదరాబాద్ నుండి అయితే 166 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతాన్ని ఇక్ష్వాకులు, పల్లవులు ఏలారు. నాగార్జున కొండ ప్రాంతంలో పూర్వికులు జరిపిన తవ్వకాల్లో ఎన్నో ప్రముఖ అవశేషాలు బయటపడ్డాయి. వాటిలో 14ముఖ్యమైన వాటిని నాగార్జున కొండపైకి తరలించి ఒక మ్యూజియం ఏర్పాటు చేసి అందులో ఉంచారు. ఇక్కడ లభించిన వాటినే ఢిల్లీ, చెన్నయ్, కోల్ కతా, పారిస్, న్యూయార్క్ నగరాల్లో ప్రదర్శనకు ఉంచారు.
నాగార్జున కొండలో దాదాపు 400వరకు శాసనాలు దొరికాయి. వాటిని గమనిస్తే అవి సంస్కృతం, తెలుగు భాషలలో ఉండటం విశేషం.
ఇక శ్రీకాకుళం జిల్లా గార మండలంలో ఉంది శాలిహుండం. వంశధార నదీ తీరాన ఉండే ప్రముఖ బౌద్ధ క్షేత్రం. శిథిలావస్థకు చేరిన దేవాలయాలతో ఎంతో రమ్యంగా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. శాలిహుండానికి మరో పేరు కూడా ఉంది. అదే శాలివాటిక. శాలివాటిక అంటే బియ్యపు ధాన్యాగారము అనిపేరు. అంతేకాదు శల్యపేటిక అని కొందరు పిలుస్తారు. అంటే ఎముకల పెట్టె అని అర్థం. ఇక్కడుండే శిథిలాలు దాదాపు బౌద్ధ కాలానికి చెందినవి.
ఇక లేపాక్షి.. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఉంది. ఇది ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజిల్లుతోంది. అంతేకాదు పర్యాటక కేంద్రం కూడా. లేపాక్షిలో ఉండే వీరభద్రస్వామి ఆలయం.. లేపాక్షి నంది పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి.
లేపాక్షి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లాలో ప్రధాన శైవక్షేత్రం, పర్యాటక కేంద్రం, ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రము. ఇక్కడ వున్న వీరభద్రస్వామి ఆలయం, లేపాక్షి నంది ప్రధాన పర్యాటక ఆకర్షణలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: