భవిష్యత్తులో ఈ వాహనాలదే రాజ్యమా ?

VAMSI
తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(టీఎస్‌రెడ్‌కో) ఆధ్వర్యంలో నిన్న ఆదివారం పీవీ నరసింహారావు మార్గ్‌(నెక్లెస్‌ రోడ్డు)లోని పీపుల్స్‌ ప్లాజాలో నిర్వహించిన 'గో ఎలక్ట్రిల్ క్యాంపెయిన్‌'ను ఐటీ, రవాణా శాఖ కమిషనర్‌, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌,  ఎంఆర్‌ఎం రావులతో కలిసి ఆయన ప్రారంభించడం జరిగింది. ఈ ప్రదర్శన కార్యక్రమంలో చార్జింగ్ పరికరాలు, ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఇతర సామగ్రి తదితరాలతో పాటుగా మొత్తం 40 స్టాళ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ రానున్న రోజుల్లో రాజ్యం ఎలక్ట్రిక్ వాహనాలదే అని, రవాణాలో ఇవి ప్రముఖ పాత్ర పోషించబోతున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. పెరిగిపోతున్న కాలుష్యం, మండిపోతున్న డీజిల్, పెట్రోల్ ధరలు ఒక కిలోమీటర్ దూరం వెళ్లాలంటే 10 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది అన్నారు. 

అదే ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించినట్లయితే ఆ ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. సామాన్యుడికి అందుబాటులో ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.  ఇక అసలు విషయానికి వస్తే నిజంగానే భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ బాగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మన పర్యావరణం పొల్యూషన్ తో నిండిపోయింది. దీనివల్ల వాతావరణం పాడవడమే కాకుండా మనుషుల ఆరోగ్యంగా క్రమక్రమంగా తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని, అయితే కాలుష్యాన్ని తగ్గించడానికి ఇదో చక్కటి అవకాశం. అంతే కాకుండా పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకి పెరుగుతూ సామాన్య ప్రజలకు చెమటలు పట్టిస్తున్నాయి.

ఈ క్రమంలో రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల ఛాయిస్ భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు వీరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అంతే కాకుండా డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్ గా ఎలక్ట్రిక్ వాహనాల్లో కొత్త మోడల్స్, ఫ్యూచర్స్ పెరిగి సరి కొత్తగా ప్రజలను ఆకర్షించే అవకాశం ఉంది. మరి రాబోయే అయిదు సంవత్సరాల కాలంలో దేశం లో ఎలక్ట్రిక్ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: