జ‌గన్‌కు కేసీఆర్ శుక్ర‌వారం షాక్ ఇదే... 60 టీంఎసీలు హ‌రి...!

VUYYURU SUBHASH
కేసీఆర్ జ‌గ‌న్‌తో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధ‌మైన‌ట్టే క‌నిపిస్తోంది. జ‌ల వివాదాల్లో జ‌గ‌న్‌ను టార్గెట్ చేసిన కేసీఆర్‌, టీఆర్ ఎస్ వ‌ర్గాలు ఈ విష‌యంలో వెన‌క్కు త‌గ్గేలా లేవు. తాజాగా శుక్ర‌వారం జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి కేసీఆర్ అదిరిపోయే షాక్ ఇచ్చారు. ఇటీవలి క్యాబినెట్ నిర్ణయానికి అనుగుణంగా తెలంగాణ‌లో కృష్ణా నదిపై కొత్త ఆనకట్ట నిర్మాణానికి సర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ  ఆనకట్టతో ఇతర ప్రాజెక్టుల నిర్మాణం సర్వే కోసం అనుమతులు కూడా ఇచ్చేసింది. ఈ ఆన‌క‌ట్ట ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో నిర్మిస్తారు.
కృష్ణానదిలో తుంగభద్ర కలిసే ముందు 35 నుంచి 40 టీఎంసీలు ప‌ట్టేలా జోగులాంబ ఆనకట్ట నిర్మాణం చేస్తారు. ఈ ఆన‌క‌ట్ట నుంచే రోజుకు ఒక టీఎంసీ నీటిని తరలించేలా నారాయణపేట జిల్లా కుసుమర్తి వద్ద వరద కాల్వ నిర్మాణం కూడా చేప‌ట్టేలా స‌ర్వే జ‌ర‌గ‌నుంది. ఈ డిజైన్లో భాగంగానే ఆలంపూర్‌, గ‌ద్వాల్ నియోజ‌క‌వ‌ర్గాల్లోని రెండు ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సుంకేశుల జలాశ‌యం వ‌ద్ద ఎత్తిపోత‌ల నిర్మాణం కూడా చేప‌ట్ట‌నున్నారు. ఇక క‌ల్వ‌కుర్తి ప్రాజెక్టు నీటి సామ‌ర్థ్యాన్ని సైతం 20 టీంఎసీల‌కు పెంచ‌నునున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి అయితే 60 టీఎంసీలు తెలంగాణ త‌ర‌లించుకు పోయిన‌ట్ల‌వుతుంది.
ఇక పులిచింత‌ల వ‌ద్ద మ‌రో ఎత్తిపోత‌ల‌ను కూడా నిర్మించ‌నున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు లక్షల ఎకరాలకు సాగునీటి కోసం ఈ నిర్మాణం ఉండ‌నుంది. ఇక లక్ష ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా సాగర్ టెయిల్ పాండ్ ఎత్తిపోతల పథకం నిర్మించ‌నున్నారు. ఈ ప్రాజెక్టులు అన్నింటికి స‌మ‌గ్ర స‌ర్వే కోసం తెలంగాణ ప్ర‌భుత్వం అన్ని అనుమ‌తులు ఇచ్చేసింది. ఏదేమైనా కేసీఆర్ జ‌గ‌న్ ను ఇరుకున పెట్టేందుకు ఉన్న ఏ చిన్న అవ‌కాశం కూడా వదులు కోవ‌డం లేదు. మ‌రి జ‌గ‌న్ రిటాక్ట్ ఎలా ?  ఉంటుందో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: