ఏపీ కి మరో భారీ షాక్ ఇచ్చిన కేసీఆర్..!

Satvika
తెలంగాణా, ఏపి మధ్య నీటి వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం పై కేసీఆర్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మొన్నీమధ్య కేబినెట్  నిర్ణయానికి తగ్గట్లు సర్వే నిర్వహించింది. ఈ మేరకు మరో కొత్త ఆనకట్ట కోసం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా నది పై మరో ఆనకట్ట ను నిర్మించనుంది. ఈ నిర్మాణానికి కావాలసిన సర్వే నిర్వహించాలని సంబంధిత అధికారులకు చెప్పుకొచ్చింది..

కృష్ణా నదిలో తుంగభద్ర కలిసే ముందు 35 నుంచి 40 టీఎంసీలు నిల్వ చేసేలా జోగులాంబ ఆనకట్ట నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.. ఇకపోతే రోజుకు ఒక టీఎంసీ నీటిని తరలించేలా నారాయణ పేట జిల్లా  దగ్గర వరద కాలువ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.అలంపూర్, గద్వాల ప్రాంతాల్లో ని రెండు లక్షల ఎకరాలకు నీటి కోసం సుంకేశుల జలాశయం వద్ద ఎత్తిపోతల నిర్మాణం చేసే ఆలోచనలో ఉన్నారు.

ఇది ఇలా ఉండగా.. కల్వకుర్తి ప్రాజెక్టు కింద జలాశయాల సామర్థ్యాన్ని 20 టీఎంసీల కు పెంచాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణా లో ఉన్న సాగు భూమికి ఈ నీరు అందెలా చేయాలని సర్కార్ ఈ ఆలోచన చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లా లోని రెండు లక్షల ఎకరాలకు సాగు నీటి కోసం పులిచింతల వద్ద ఎత్తి పోతల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది. లక్ష ఎకరాల మేర అంతరం ఉన్న ఆయకట్టుకు నీరందించేలా సాగర్ టెయిల్ పాండ్ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నారు... కాగా, తాజాగా ఆ ప్రాజెక్టు కు సంబంధించిన పూర్తి సర్వే చేపట్టాలని అనుమతులు జారీ చేసింది.. ఈ సర్వే కనుక పాజిటివ్ గా వస్తే కొత్త ఆనకట్ట మాత్రం పడుతుంది.. ఈ నిర్మాణం వల్ల ఎన్నో లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. రాష్ట్రం మొత్తం పంటల తో ఉంటుందని అధికారులు అభిప్రాయ పడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: