డెల్టా వేరియంట్ అనురాగ్ అగర్వాల్ షాకింగ్ కామెంట్స్..

VAMSI
ఇప్పటికే ప్రపంచాన్ని కరోనా వైరస్ దశల వారీగా దాడులు చేస్తూ ప్రజలను నానా తిప్పలు పెడుతుంటే, ఈ మధ్య కాలంలో డెల్టా వేరియంట్ అని పేరు అందరినీ భయంతో మానసికంగా క్రుంగి పోయేలా చేస్తోంది. ఇప్పటికే విదేశాల్లో వణుకు పుట్టిస్తున్న ఈ డెల్టా వేరియంట్ ఇప్పుడు మన దేశంలోనూ కలకలం రేపుతోంది. కొందరు డెల్టా వేరియంట్ అనేది లేనేలేదు అంటుంటే, మరికొందరు దేశంలో ఇప్పుడు కరోనా కంటే వేగంగా డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందుతోంది అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ డెల్టా వేరియంట్ పై పలు రకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ప్రజలు దేనిని నమ్మాలో తెలియక అయోమయ పరిస్థితిలో ఉన్నారు.


అయితే తాజాగా డెల్టా వేరియంట్  పై కీలక వ్యాఖ్యలు చేస్తూ క్లారిటీ ఇచ్చారు అనురాగ్ అగర్వాల్. దేశంలో ఇంకా కరోనా రెండవ దశ ముగియ లేదన్న విషయాన్ని తెలుసుకోవాలని ఆయన అన్నారు. ఇక కరోనా మూడవ దశలో డెల్టా ప్లస్ వేరియంట్ విజృంభించబోతోంది అంటున్న వార్తల గురించి చింతించాల్సిన అవసరం లేదు. దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి అన్న విషయం వాస్తవమే. కానీ ఇది  ఆందోళన చెందాల్సిన అంతా ప్రమాదకర స్థాయిలో లేదన్నది అందరూ తెలుసుకోవాల్సి ఉంది. ప్రస్తుతానికి ఇవి చాలా చాలా తక్కువ స్థాయిలో  1% కంటే కూడా తక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి.  


మహారాష్ట్రలో మా ఇన్స్టిట్యూట్ (ఐజిఐబి) దాదాపుగా 3,500 శాంపిల్స్ ను కలెక్ట్ చేసి పరిశీలించగా వాటిలో డెల్టా ప్లస్ వేరియంట్ ఆనవాళ్లు గుర్తించడం జరిగింది. కానీ ఇక్కడ   అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రచారంలో ఉన్న విధంగా థర్డ్ వేవ్ లో డెల్టా ప్లస్ వేరియంట్ ప్రజల ప్రాణాలకు పెను ముప్పు కాబోతున్న వార్తలకు ఎటువంటి ఆధారాలు లేవని, దీనిని పరిగణనలోకి తీసుకోవాల్సి అంత స్థాయిలో డెల్టా ప్లస్ వేరియంట్ ఉనికిలో లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ జాగ్రత్త ఎంతైనా అవసరమైన అని సూచించారు. ఇంకా సెకండ్ వేవ్ ముగిసిపోలేదు అని ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. తక్కువ సంఖ్యలో కేసులు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో కేంద్రం కేరళ, మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో కేసులు ఉండే ప్రాంతాలను కంటోన్మెంట్ జోన్ లు గా ప్రకటించి అప్రమత్తంగా వ్యవహరించాలని, తగిన చర్యలు వెంటనే చేపట్టాలని సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: