ఆ సంచలన కేసు కొట్టివేసిన సుప్రీంకోర్టు?

praveen
2012లో కేరళ జాలర్ల హత్య దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేరళ తీరంలో చేపలవేటకు వెళ్లిన జాలర్లను ఇటలీ నావికా సిబ్బంది అయిన సాల్వటోర్ గిరోండే, మాసిమిలియానో లాటోర్రెలు అంతర్జాతీయ సరిహద్దులు దాటారు అన్న కారణంతో చివరికి కేరళ జాలర్లను కాల్చి చంపారు. ఇక  ఈ ఘటన కాస్త దేశవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది. ఇక గత తొమ్మిదేళ్ల నుంచి ఈ కేసుపై విచారణ కొనసాగుతూనే ఉంది. ఇటీవలే  సుప్రీం కోర్టు ఈ కేసును కొట్టివేస్తున్నట్లు సంచలన తీర్పు వెలువరించింది.


 ఈ కేసుకు సంబంధించి విచారణ మొదట కేరళ హైకోర్టు లో జరిగింది. ఇక బాధితులకు 10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలి అంటూ హైకోర్టు తీర్పు వెలువరించింది.  ఆ తర్వాత విచారణ కాస్తా ఇటీవలే అత్యున్నత స్థానానికి చేరింది.  ఇక దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.  ఇటలీ ప్రభుత్వం పదికోట్ల రూపాయల నష్ట పరిహారం చెల్లించేందుకు ఒప్పుకోవడంతో భారత్లో ఇటలీ నావికాదళం పై నమోదైన కేసులను కొట్టివేస్తు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఈ కేసు రెండు నెలల కిందటే ముగించాల్సి ఉన్నప్పటికీ...  కేరళ హైకోర్టు, ఇటలీ ప్రభుత్వం మధ్య ఒప్పందం ప్రకారం నష్టపరిహారం చెల్లించడంలో జాప్యం చేసింది ఇటలీ ప్రభుత్వం.

 దీంతో ఈ కేసు కాస్త వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇటీవల అత్యున్నత న్యాయ స్థానానికి ఈ కేసు వెళ్లగా.. ఇటలీ ప్రభుత్వం పది కోట్ల మేర పరిహారం చెల్లించేందుకు ఒప్పుకోవడం తో కేసు కొట్టి వెళ్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఇక ఒక్కో మత్స్యకారుడి కుటుంబానికి నాలుగు కోట్ల మేర పరిహారం అందించాలని.. మిగతా నగదును బోటు యజమాని ఇవ్వాలని సుప్రీంకోర్టు తెలిపింది. అంతర్జాతీయ జలాల మధ్యవర్తిత్వ నిబంధనల ప్రకారం కేసు కొట్టివేసినట్లు అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: