కరోనాకు భయపడకండి ... పిల్లల తల్లితండ్రులు ఇలా చేయండి ?

VAMSI

దేశంలో కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న సమయంలో, ఈ ముప్పు ఎక్కువగా పిల్లల పైనే ప్రభావం చూపబోతోందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అయితే తల్లిదండ్రులు ఆందోళన పడవద్దు అని అప్రమత్తంగా ఉంటే మీ పిల్లలు క్షేమమే నని అంటున్నారు డాక్టర్లు. కాగా  ఇంతకీ వారు చెబుతున్న సలహాలు సూచనలు ఏమితో ఒకసారి చూద్దాం. కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి ముందుగా మన పిల్లల శరీరాన్ని సంసిద్ధం చేయాలి. ముఖ్యంగా విటమిన్ డి బాగా పెరిగేలా చూసుకోవాలి. అలాగని విటమిన్ డి టాబ్లెట్ లు ఇవ్వకూడదు. దీనివల్ల పిల్లలకు సైడ్ ఎఫెక్ట్స్ కలిగే అవకాశం ఉంది. కాబట్టి సహజంగానే డి విటమిన్ పెంచేలా చర్యలు తీసుకోవాలి. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల లోపు కనీసం ఒక గంట అయినా పిల్లలను ఎండలో ఆడుకోమని చెప్పాలి.

 * ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను పిల్లలకు ఎక్కువగా తినిపించాలి. ఉదాహరణకు శనగ ముద్దలు, బెల్లంతో చేసిన అరిసెలు, నువ్వులు మరియు డ్రై ఫ్రూట్స్ వంటివి  తినిపించాలి.
* పిల్లకు ఇచ్చే ఆహారంలో ఆకుకూరలు ఎక్కువగా ఇవ్వాలి. క్యారెట్ బీట్రూట్ లను తరచూ పిల్లల ఆహారంలో చేర్చాలి. తాజా పండ్లు తినేలా చూసుకోవాలి .  గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు చేయాలి. టీవీ లకు ఫోన్ లకు అతుక్కొని పోకుండా, ఎక్కువగా ఆటలు ఆడుకునేలా ప్రోత్సహించాలి.
* మట్టిలో ఆడటం మంచిదే అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి.  కనీసం వారానికి ఒకసారి లేత వేపాకు చిగురు కొంచెం పిల్లలకు తినిపించాలి. మంచి నీళ్లు బిందెలో కొంచెం తులసి ఆకు, కొంచెం పుదీనా ఆకు వేసి ఉంచి ఆ నీటిని తాగడం మంచిది.
* జంక్ ఫుడ్ ను పూర్తిగా ఇవ్వడం మానేయండి. మొలకెత్తిన విత్తనాలు తినిపించడం చాలా మంచిది. అప్పుడప్పుడు గోరువెచ్చటి పాలలో చిటికెడు పసుపు వేసి తాగించండి.
* పిల్లలు మానసికంగా ఒత్తిడికి గురి కాకుండా చూసుకోండి. తరచూ తిట్టడం, కొట్టడం వంటివి మానేయాలి. ప్రశాంతమైన వాతావరణంలో ఆహ్లాదకరంగా పెరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇవన్నీ పాటించడం ద్వారా మీ పిల్లలు మానసికంగా శారీరకంగా దృఢంగా తయారవుతారు. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, తద్వారా కరోనాని చాలా సులభంగా జయించగలుగుతారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: