బాబుకు ఆ బడా ఫ్యామిలీలు షాక్ ఇచ్చేలా ఉన్నాయిగా!

M N Amaleswara rao

టీడీపీ అధికారం కోల్పోయి రెండేళ్ళు అయిపోయింది. ఇక ఈ రెండేళ్లలో పార్టీ పుంజుకున్నట్లు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతోనే చాలామంది టీడీపీ నాయకులు సైలెంట్ అయిపోయారు. ఇక పలువురు నాయకులు పార్టీ మారిపోయారు. దీంతో టీడీపీ తరుపున పోరాడే నాయకులు తక్కువ అయిపోయారు. ఓ వైపు అధికార వైసీపీ నేతలు డామినేషన్ పెరిగిపోతుంది.


ఇలాంటి సమయంలో పార్టీ కోసం కష్టపడాల్సిన నాయకులు అడ్రెస్ లేకుండా పోయారు. ఏదో చంద్రబాబు, లోకేష్‌లతో పాటు పలువురు నాయకులు మాత్రం నిత్యం రాజకీయాల్లో కనిపిస్తూ, జగన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. అయితే అధికారం ఉన్నప్పుడు కనిపించిన నాయకులు, ఓడిపోయాక మాత్రం సైలెంట్ అయిపోయారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న కే‌ఈ కృష్ణమూర్తి ఫ్యామిలీ సైతం సైలెంట్ అయిపోయింది.


గతంలో కే‌ఈ, చంద్రబాబు కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. ఇక 2019 ఎన్నికల్లో కే‌ఈ పోటీ నుంచి తప్పుకుని తన తనయుడు కే‌ఈ శ్యామ్‌ని పత్తికొండ బరిలో దింపారు. అటు డోన్‌లో కే‌ఈ సోదరుడు ప్రతాప్ పోటీ చేశారు. జగన్ వేవ్‌లో ఇద్దరు ఓడిపోయారు. ఓడిపోయాక కే‌ఈ ఫ్యామిలీ అడ్రెస్ లేకుండా పోయింది. అప్పుడప్పుడు కే‌ఈ మరో సోదరుడు ప్రభాకర్ హడావిడి చేస్తున్నారుగానీ, మిగిలిన కుటుంబ సభ్యులు కనిపించడం లేదు.


అటు గత ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన సూర్యప్రకాశ్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఫ్యామిలీ సైతం టీడీపీలో పెద్దగా కనిపించడం లేదు. గత ఎన్నికల్లో కోట్ల కర్నూలు ఎంపీగా పోటీ చేయగా, ఆయన భార్య సుజాతమ్మ ఆలూరు నుంచి పోటీ చేశారు. ఇద్దరు ఓడిపోయారు. ఓడిపోయాక సుజాతమ్మ ఆలూరులో కనిపించారు గానీ, కోట్ల మాత్రం పెద్దగా కనిపించలేదు. కోట్ల తనయుడు కూడా సైలెంట్‌గానే ఉంటున్నారు. మొత్తానికైతే చంద్రబాబుకు కే‌ఈ, కోట్ల ఫ్యామిలీలు షాక్ ఇచ్చేలా ఉన్నాయి. మరి వచ్చే ఎన్నికల్లోనైనా యాక్టివ్ అవుతారేమో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: