లఢఖ్‌కు కొత్త మార్గం.. అనుమతి వచ్చేసింది..

Shanmukha
న్యూఢిల్లీ: లడఖ్‌కు సరికొత్త మార్గం నిర్మించేందుకు ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రణాళిక సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అనుమతి ఇచ్చారు. అంతేకాకుండా ఈ మార్గాన్ని ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా లడఖ్‌కు రాకపోకలు జరిగే విధంగా నిర్మించాలని నిర్ణయించింది. మనాలీ నుంచి లేహ్ వెళ్లేందుకు దీనిని నిర్మిస్తున్నారు. అయితే దీనిని సొరంగ మార్గంగా ఏర్పాటు చేయనున్నారు. దీనిని దార్చా, పడుమ్, నిమ్ము ప్రాంతాల ద్వారా ఈ సొరంగాన్ని నిర్మించనున్నారు. ఈ సొరంగాన్ని షిన్‌కున్ లా పాస్ కింద నిర్మించనున్నారు. అంతేకాకుండా దీని పొడవు దాదాపు 4.25 కిలోమీటర్ల మేరకు దీనిని కట్టనున్నారు.


అయితే ఈ సొరంగ మార్గం భారత సైన్య రవాణాకు ఉపయోగపడుతుంది. దీనిని నిర్మించడం ద్వారా లడాఖ్ సెక్టార్‌లో సైన్యానికి అత్యవసరాల్ని అందించడం ఎంతో సులభం అవుతుంది. దీనిని షిన్‌కున్ కనుమ కింద దాదాపు 13.5 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గంగా నిర్మించాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. దీని కోసం హైవే అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ మార్గానికి సంబంధించి ఓ ప్లాన్‌ను కూడా సిద్దం చేసింది. ఈ ప్లాన్‌ను ఈ ఏడాది మార్చిలోనే రక్షణ మంత్రి రాజ్‌నాథ్, ఇతర ఉన్నతాధికారులు పరిశీలించారు. చివరికి బీఆర్ఓ ఈ ప్లాన్‌కు ఆమోదం తెలిపింది. అయితే ఈ సొరంగ మార్గ నిర్మాణానికి దాదాపు రూ.1000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.


ప్రస్తుతం భారత సైన్యానికి అవసరమైన వాటిని చేరవేసేందుకు మనాలీ, సార్చు, ఉప్షి, లేహ్ ద్వారా వెళ్తున్న రోడ్డు మార్గాన్ని వినియోగిస్తున్నారు. ఈ రోడ్డు మార్గం నాలుగు పర్వత శ్రేణుల గుండా వెళ్తుంది. రవాణా కోసం రోహ్‌తంగ్ కింద ఓ సొరంగాన్ని నిర్మించినప్పటికీ శీతాకాల సమయంలో దాదాపు రెండు, మూడు నెలలు మంచు విపరీతంగా కురుస్తోంది. దీని కారణంగా రవాణా కష్టతరం అవుతోంది. దీంతో ఈ సొరంగ మార్గం ఉన్నప్పటికీ రోడ్డు మార్గాన్నే వాడాల్సి వస్తుంది.


ఇదిలా ఉంటే దార్చా, పడుమ్, నిమ్ము రోడ్డు దాదాపు 297 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దీనిలో దాదాపు 100 కిలోమీటర్ల మేరకు డబుల్ లేన్ ఉంది. ఇది బ్లాక్ టాప్ రోడ్డు. దీనిని భారత్-చైనా మధ్య ఏర్పడిన ఉద్రిక్తతల సమయంలో బీఆర్ఓ ఎంతో చురుగ్గా నిర్మించింది. ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్న రోడ్డు కారణంగా రవాణాలో ఎటువంటి మార్పు ఉండదు. అదే దూరం ప్రయాణం చేయాల్సి ఉంది. కానీ ఈ సొరంగ మార్గం వల్ల లడఖ్, కార్గిల్, సియాచిన్ సెక్టర్లలో ఉండే భారత సైన్యానికి శీతాకాలంలోనూ ఆహారం, ఆయుధాలు వంటివాటిని సరఫరా చేయడం ఎంతో సులభం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: