ఈ బ్యాటరీ గురించి మీకు తెలుసా.?

Suma Kallamadi
వాహనాల ధర ఎంత ఎక్కువగా ఉంటుందో మనకి తెలియనిది కాదు. అలాగే విద్యుత్‌ వాహనాల ధర మరి ఎక్కువగా ఉండడానికీ అందులోని బ్యాటరీ కూడా ఒక  కారణం అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు వాహనాలు తయారుచేసే కంపెనీలు బ్యాటరీ వ్యయాలు తగ్గించుకోవడం ద్వారా ధరలను తగ్గించాలని అనుకుంటున్నాయి.అందుకోసం వాహనాలలో సాలిడ్‌ స్టేట్‌ బ్యాటరీలను వినియోగించాలి అని అనుకుంటున్నాయి. కానీ వాటి నుంచి విద్యుత్‌ను రాబట్టుకునే క్లిష్ట ప్రక్రియకు సాంకేతికత ఎంత వరకు సహాయం చేస్తుంది?  ఎపుడు అందుబాటులోకి వస్తాయన్నదో తెలియదు. అసలు సాలిడ్ స్టేట్ బ్యాటరీలంటే ఏమిటో తెలుసుకోండి. ఇప్పటిదాకా మనం వాహనాల్లో  వినియోగిస్తున్న లిథియం అయాన్‌ బ్యాటరీల్లో ద్రవరూప ఎలక్ట్రోలైట్‌ను వినియోగిస్తున్నాయి.వాటి స్థానంలో ఘనరూపంలో అయాన్‌-కండక్టింగ్‌ మెటీరియల్‌ను వాడతారు. వాటినే సాలిడ్‌ స్టేట్‌ బ్యాటరీలు అంటారు.అయితే వీటి వల్ల ఉపయోగం ఏంటంటే.. ద్రవరూప బ్యాటరీలతో పోలిస్తే వీటిలో ఎక్కువ విద్యుత్‌ను నిల్వ ఉంచవచ్చు.తద్వారా  బ్యాటరీ పరిమాణాన్ని తగ్గించుకోవచ్చు. దాంతో కారు బరువు తగ్గి మైలేజీ ఎక్కువ ఇస్తుంది. కారులో స్థలం కూడా పెరుగుతుంది. అన్నిటికీ మించి కిలోవాట్‌ అవర్‌కు అయ్యే ఖర్చు తగ్గుతుంది. తాజాగా ఫోర్డ్, బీఎమ్‌డబ్ల్యూ వంటి కంపెనీలు 'సాలిడ్‌ పవర్‌' కంపెనీలో పెట్టుబడులు పెట్టింది ఈ బ్యాటరీలను పొందడానికే.వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఫోర్డ్‌తో పాటు బీఎమ్‌డబ్ల్యూకు సైతం 100 యాంప్‌-అవర్‌ బ్యాటరీలను ఇవ్వడానికి యత్నాలు చేస్తోంది.ఈ దశాబ్దం చివరకు సాలిడ్‌ స్టేట్‌ బ్యాటరీలతో ఈవీలు సిద్ధం కావొచ్చని ఫోర్డ్‌ అంటోంది. అలాగే ఈ విద్యుత్‌ వాహనాలకు ఏసీ ఛార్జింగ్‌ పాయింట్లను చౌకగా రూపొందించేందుకు సంబంధించి భారత ప్రమాణాలను (ఇండియన్‌ స్టాండర్డ్స్‌) రెండు నెలల్లోగా విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కనిష్ఠంగా రూ.3,500 ధర నుంచి ఛార్జింగ్‌ యూనిట్‌లను అందుబాటులోకి తేవాలన్నది లక్ష్యమని పేర్కొంది. విద్యుత్‌ వాహనాల కోసం తక్కువ వ్యయంతో కూడిన ఛార్జింగ్‌ మౌలిక వసతులు కల్పించే కొత్త పరిశ్రమ రంగం అవతరించనుందని తెలిపింది. చౌక ఛార్జింగ్‌ యూనిట్లను అందుబాటులోకి తేవడాన్ని నీతి ఆయోగ్‌ సహకారంతో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీస్, ఆఫీస్‌ ఆఫ్‌ ద ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ అడ్వయిజర్‌లు ఓ సవాలుగా తీసుకున్నాయని వివరించింది. స్మార్ట్‌ఫోన్‌తో పనిచేసే స్మార్ట్‌ ఏసీ ఛార్జింగ్‌ పాయింట్‌ను రూ.3500 (50 డాలర్లు) ధర లోపే తేవాలని ఈ బృందం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపింది.మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: